TG: రాజ్ పాకాలకు హైకోర్టు రెండు రోజుల సమయం ఇచ్చింది. పోలీసుల ఎదుట హాజరయ్యేందుకు రెండు రోజుల గడువు ఇస్తున్నట్లు వెల్లడించింది. రాజ్ పాకాల రిట్ పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. పోలీసుల దర్యాప్తులో సమాచారం లేదా ఆధారాలు లభిస్తే చర్యలు తీసుకుంటామని హైకోర్టుకు ఏఏజీ తెలిపారు. దీంతో నిబంధనల ప్రకారమే ముందుకెళ్లాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.