సైబర్ మనీలాండరింగ్‌పై గుజరాత్, ఏపీ పోలీసులు జరిపిన దాడుల్లో కీలకమైన ఆధారాలు బయటపడినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. రెండు రాష్ట్రాల పోలీసులు దేశవ్యాప్తంగా దాడులు జరిపినట్లు హోం శాఖ తెలిపింది. ఈ మేరకు దేశ ప్రజలను అప్రమత్తం చేస్తూ… కీలక ప్రకటన చేసింది. ప్రజలు ఎవరూ.. తమ అకౌంట్లను అద్దెకు ఇవ్వొద్దు, అమ్ముకోవద్దని హెచ్చరించింది. ఆధార్, కంపెనీ రిజిస్టర్ సర్టిఫికెట్లను ఎవరికీ ఇవ్వొద్దని సూచించింది.