ఓ వ్యక్తిని ముక్కలు ముక్కలుగా నరికి హత్య చేసిన కేసులో ఎల్బీనగర్ కోర్టు తీర్పు వెలువరించింది. నేరస్తుడికి యావజ్జీవ కారాగారశిక్ష పాటు రూ.15 వేల జరిమానా విధించింది. కాసులాబాద్ గ్రామానికి చెందిన తట్టపల్లి రాజు, గంజేటి అంజయ్య మధ్య డబ్బుల విషయంలో 2020 ఆగస్టు 15న గొడవ జరిగింది. ఈ క్రమంలో రాజును అంజయ్య గొడ్డలితో మూడు ముక్కలుగా నరికేసి.. అదే గ్రామంలోని మురికి కాల్వలో తలభాగం, మిగతా రెండు భాగాలను పాడుబడ్డ బావిలో పడేశాడు.