AP: ఎంపీ అవినాశ్ రెడ్డి పిటిషన్పై నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతించాలని ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్పై అవినాశ్ రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న సీబీఐ కోర్టు.. విచారణను వచ్చే నెల 8కి వాయిదా వేసింది.