దేశ ప్రజలను అప్రమత్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. నేర సంపాదన డబ్బుతో మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నారని.. నేరపూరిత అక్రమార్జనకు నకిలీ బ్యాంకు ఖాతాలు వాడుతున్నట్లు కేంద్ర హోంశాఖ పేర్కొంది. AP, గుజరాత్ పోలీసులు దేశవ్యాప్తంగా జరిపిన దాడుల్లో ఈ విషయం బయటపడింది. ప్రజలు తమ బ్యాంకు ఖాతాలు అద్దెకు ఇవ్వొద్దని, అమ్ముకోవద్దని, ఆధార్, కంపెనీ రిజిస్టర్ సర్టిఫికెట్లు ఎవరికీ ఇవ్వొద్దని తెలిపింది.