ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా తెలుగు టైటాన్స్-పాట్నా పైరేట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. HYDలోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ గెలుపొందింది. ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్లో 28-26 పాయింట్ల స్వల్ప తేడాతో తెలుగు టైటాన్స్ విజయం సాధించింది. తెలుగు టైటాన్స్ జట్టులో అత్యధికంగా ఆశిశ్ నర్వాల్ 9 పాయింట్లు సాధించాడు. అతనికి తోడు పవన్ సెహ్రావత్ 5, అంకిత్ 4, విజయ్ మాలిక్ 3 పాయింట్లతో రాణించారు.