NDL: ధర్మపథంలో భాగంగా శ్రీశైల దేవస్థానం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరిస్తున్నాయి. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద పరమేశ్వర విభూతి శివానుభూతి అనే అంశంపై ప్రసంగ కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్రహ్మశ్రీ రాయప్రోలు జగదీశ్ చంద్రశర్మ, తెనాలి వారు పరమేశ్వర విభూతి- శివానుభూతి, ఎం.కృష్ణకిశోర్,బాపట్ల వారు వైభవాన్ని వివరించారు.