సైబర్ మనీలాండరింగ్‌పై కేంద్రం దృష్టి సారించింది. గుజరాత్, ఏపీ పోలీసులు జరిపిన దాడుల్లో లభ్యమైన ఆధారాలతో నేరం బయటపడినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. రెండు రాష్ట్రాల పోలీసులు దేశవ్యాప్తంగా దాడులు జరిపినట్లు తెలిపింది. దేశ ప్రజలను అప్రమత్తం చేస్తూ హోంశాఖ కీలక ప్రకటన చేసింది. ప్రజలు ఎవరూ.. తమ అకౌంట్లను అద్దెకు ఇవ్వొద్దు, అమ్ముకోవద్దని హెచ్చరించింది. ఆధార్, కంపెనీ రిజిస్టర్ సర్టిఫికెట్లను ఎవరికీ ఇవ్వొద్దని పేర్కొంది.