VZM: గంట్యాడ మండలంలోని ఒక గ్రామంలో అత్యాచారానికి గురై విజయనగరం ఘోషా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మూడున్నర ఏళ్ల బాలిక కుటుంబాన్ని మంత్రి సంధ్యారాణి సోమవారం పరామర్శించారు. మానవత్వాన్ని మంట గలిపిన ఇటువంటి మానవ మృగాలకు కఠినంగా శిక్షపడాల్సిన అవసరం ఉందన్నారు. నిందితుడికి బెయిల్ ఇప్పించవద్దని న్యాయవాదులకు ఆమె విజ్ఞప్తి చేశారు.