ప్రభుత్వంతో పని చేయించాలని ఢిల్లీలో ఎమ్మెల్యే జితేంద్ర మహాజన్ ఆ రాష్ట్ర హైకోర్టుకు వెళ్లారు. ఢిల్లీలోని ఓ పైవంతెనకు మరమ్మతులు చేపట్టి, పునఃప్రారంభించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిని విచారించిన కోర్టు.. “ఎమ్మెల్యేలే కోర్టులకు రావడం మొదలుపెడితే ఏం జరుగుతుంది? ఎన్నో అంచనాలతో ప్రజలు ప్రజాప్రతినిధి వద్దకు వస్తారు. ఆ సమస్యను ఎలా ఎత్తిచూపాలో తెలిసి ఉండాలి” అని పేర్కొంది.