దేశంలో క్విక్ కామర్స్ కంపెనీల హవా సాగుతోంది. ఏదైనా కిరాణా వస్తువు కావాలంటే నిమిషాల్లో గడప ముందుకు తెచ్చేస్తున్నారు. బ్లింక్ఇట్, జెప్టో, వంటి డెలివరీ సంస్థలు మూలంగా సాంప్రదాయ దుకాణాలు దెబ్బతింటున్నాయి. ఏఐసీపీడీఎఫ్ అధ్యయనం ప్రకారం క్విక్ కామర్స్ కంపెనీల కారణంగా గడిచిన ఏడాదిలో కనీసం రెండు లక్షల కిరాణా స్టోర్లు మూత పడ్డట్లు తెలిసింది.