SKLM: కవిటి మండలం శహలాపుట్టుగలో గతంలో సచివాలయం నిర్మాణానికి స్థలం ఇచ్చిన రైతుకు నేటికీ పరిహారం అందకపోవడంతో సోమవారం ఆ రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. సమస్యను ఎమ్మెల్యే అశోక్ బాబు దృష్టికి తీసుకెళ్లడంతో తక్షణమే స్పందించారు. గ్రామానికి ఎంపీడీవో చేరుకుని బాధిత రైతును కలిశారు. సమస్యను త్వరలోనే పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతు హర్షం వ్యక్తం చేశాడు.