KRNL: ఇసుకకు సీనరేజీ ఫీజు, డీఎంఎఫ్, మెరిట్ కింద మెట్రిక్ టన్నుకు రూ.88 ఉండగా, ప్రస్తుతం ప్రభుత్వం ఆ ఫీజులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ పీ.రంజిత్ బాషా పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఇతర రాష్ట్రాలకు అక్రమంగా ఇసుకను తరలించకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.