NDL: పాములపాడులోని కేజీ రోడ్డు పక్కన ఉన్న పురాతనమైన ఆరోగ్య ఉపకేంద్రం శిథిలావస్థకు చేరిందని దాన్ని పడగొట్టి క్రింద హెల్త్ సబ్ సెంటర్‌పైన 108 ఆఫీస్ రూమ్‌ను ప్రభుత్వం వెంటనే నిర్మించాలని మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి అంకన్న సోమవారం పేర్కొన్నారు. వర్షం పడిందంటే ఈ సబ్ సెంటర్లో మోకాళ్ల నీళ్లు నిలబడుతూ ఉండడంతో అక్కడికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు అన్నారు.