VZM: గత ఆగష్టు నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం మండల వ్యవసాయాధికారి మోపాడ ఉమామహేశ్వరనాయుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఏపీ వ్యవసాయ అధికారుల సంఘం ముందుకొచ్చింది. మానవతా దృక్పథంతో విరాళాలు సేకరించి ఫిక్సిడ్ డిపాజిట్ రూపంలో రూ.30 లక్షల చెక్కును సోమవారం అందజేశారు.