AP: విజయవాడ వరదల్లో డ్రోన్లు వినియోగించామని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘వ్యవసాయం, మౌలిక వసతుల రంగంలో డ్రోన్లది కీలకపాత్ర. కొన్ని దేశాలు యుద్ధాల్లో డ్రోన్లు వాడుతున్నాయి. మేం అభివృద్ధి కోసం వాడతాం. డ్రోన్ల ద్వారా భవిష్యత్తులో రోగులు ఇంటివద్దే ఉండి చికిత్స తీసుకోవచ్చు. రౌడీషీటర్ల కదలికలపై నిఘా పెట్టవచ్చు. ట్రాఫిక్ సమస్యలు పరిరక్షించవచ్చు. పోలీసు శాఖలో డ్రోన్ల విస్తృత వినియోగానికి కృషి చేస్తున్నాం’ అని అన్నారు.