ముంబైకి భారత వాతావరణ విభాగం (IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ ఉదయం 8.30 గంటల వరకు ఈ హెచ్చరిక వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ వ్యవధిలో ముంబై పరిధిలో ఈదురుగాలులు, పిడుగుపాటుకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముంబైతోపాటు మహారాష్ట్రలోని పాల్ఘర్, నందూర్బర్, ధూలే, జల్గావ్, సోలాపూర్, సతారాలో గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.