TG: జన్వాడ ఫామ్ హౌస్ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. తమకు విజయ్ మద్దూరి సహకరించట్లేదని పోలీసులు తెలిపారు. ఫామ్ హౌస్‌పై దాడి సమయంలోనూ తన ఫోన్ దాచి పెట్టి.. అక్కడున్న ఓ మహిళ ఫోన్‌ను పోలీసులకు ఇచ్చారు. డ్రగ్స్ లింక్స్ బయటపడతాయన్న భయంతోనే.. పోలీసులకు విజయ్ మద్దూరి మహిళ ఫోన్ ఇచ్చారని ఆరోపణలు వస్తున్నాయి. పార్టీలో కాయిన్స్ రూపంలో పేకాట ఆడినట్లు పోలీసులు గుర్తించారు.