చెస్ ఒలింపియాడ్ విజేతలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 45వ ఫిడే చెస్ ఒలింపియాడ్‌లో బంగారు పతకం గెలిచిన భారత జట్లపై ఆయన ప్రశంసలు కురిపించారు. పురుషులు, మహిళా జట్ల క్రీడాకారులు అద్భుతం చేశారని కొనియాడారు. దేశం గర్వపడేలా తమ ప్రతిభ కనబరిచారని పేర్కొన్నారు. కాగా, హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జరిగిన ఈవెంట్లో భారత్ రెండు స్వర్ణాలు గెలుచుకున్న విషయం తెలిసిందే.