మణిపుర్ రాజధాని ఇంఫాల్‌లోని ఓ కళాశాల గేట్ వద్ద గ్రనేడ్ కలకలం రేగింది. గవర్నర్ అధికార నివాసానికి కేవలం 200 మీటర్ల దూరంలో గ్రనేడ్ లభ్యమవ్వడంతో సంచలనం సృష్టిస్తోంది. గ్రనేడ్‌తో పాటు శ్రామికవర్గ విద్యార్థుల హక్కులను గౌరవించాలంటూ ఓ నోట్ కూడా లభ్యమయినట్లు అధికారులు తెలిపారు.