దేశం ముందున్న అతిపెద్ద సవాల్ ఉపాధి కల్పనే అని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘చాలా మంది యువత డిగ్రీ పట్టాలతో బయటకు వస్తున్నారు. కానీ, తమకున్న అర్హతకు, సాధించిన ఉద్యోగానికి మధ్య వ్యత్యాసం ఉందని వారు భావిస్తున్నారు. ఈ లోటును భర్తీ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. కృత్రిమ మేధ (AI) వంటి సాంకేతికతల్లో నైపుణ్యాన్ని అందించేందుకు యువతను సన్నద్ధం చేస్తోంది’ అని ఆమె అన్నారు.