ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డ ప్రయోజకులు కావాలనే కోరుకుంటారు. అందుకే.. వారి స్థోమతకు మించి కూడా ఉన్నత విద్యను అందిస్తూ ఉంటారు. పిల్లలు సైతం తమ తల్లిదండ్రుల కలను నిజం చేయాలని అనుకుంటారు. అందుకోసం శాయశక్తులా శ్రమిస్తూ ఉంటారు. ఇలానే ఓ యువతి కూడా… ఉన్నత లక్ష్యానికి చేరుకొని… తనని కన్న తల్లిదండ్రులు మరింత గర్వపడేలా చేయాలని అనుకుంది. అందుకోసం ఉన్నత విద్యను అభ్యసించడానికి యూనివర్శిటీకి వెళ్లాల్సి వచ్చింది. అందుకోసం తల్లిదండ్రూలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ క్షణంలో కూతురికి దూరంగా ఉండాలనే ఓ తండ్రి బాధకు అద్దంపట్టే వీడియో నెట్టింట వైరల్ గా మారింది
ఓయువతికి ఢిల్లీ యూనివర్శిటీలో సీటు వచ్చింది. యూనివర్శిటీలో విద్య కోసం ఆమె తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందులో సీటు సంపాదించడం ఆమె కల. తన కల నెరవేర్చుకోవడానికి చాలా కష్టపడింది. కష్టానికి ప్రతిఫలం దక్కింది. తీరా యూనివర్శిటీలో చేరాల్సిన రోజు వచ్చింది. కూతురు గొప్ప స్థాయికి వెళ్తున్నందుకు ఆనందంగా ఉన్నా.. అందుకోసం తమకు దూరంగా ఉండాల్సి రావడంతో.. ఆమె తండ్రి కన్నీటి పర్యంతమయ్యాడు. కూతురిని విడిచిపెట్టడానికి మనసు రాక.. చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు. దీనిని స్థానికులు వీడియో తీసి నెట్టింట షేర్ చేయగా… అది కాస్త వైరల్ గా మారింది. కూతురిపై ఆయనుకున్న ఆకాశమంత ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వీడియో షేర్ చేసిన కేవలం ఐదు రోజుల్లో 9.3 మిలియన్ల మంది వీక్షించడం గమనార్హం. దీనికి మిలియన్ కు పైగా లైకులు లక్షల్లో కామెంట్స్ రావడం విశేషం.
గుండెలకు హత్తుకునేలా ఈ వీడియో ఉందంటూ నెటిజ్లు కామెంట్స్ చేస్తున్నారు. కొందరు సెలబ్రెటీలు సైతం ఈ వీడియోకి కామెంట్స్ చేయడం గమనార్హం.