Urvashi Rautela:మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ మూవీ ఇటీవల సంక్రాంతికి రిలీజై హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో వేర్ ఈజ్ ద పార్టీ అంటూ హల్ చల్ చేసిన బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలాకు త్రుటిలో అగ్ని ప్రమాదం తప్పింది. ఆ ప్రమాదం వీడియోను ఊర్వశి రౌతేలా స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నారు. గ్లామర్ అకాడమీ ప్రారంభోత్సవం కోసం పింక్ సిటీ జైపూర్ చేరుకున్నారు. ఈ సమయంలో ఆమె ఆఫ్-షోల్డర్ బ్లౌజ్‌తో పర్పుల్ చీరను ధరించింది. అందులో ఆమె తన గ్లామరస్ లుక్‌తో అందరినీ ఆకట్టుకుంది. హై పోనీ కేశాలంకరణలో కనిపించింది. ఆమెను చూడటానికి పెద్ద సంఖ్యలో అభిమానులు ఇక్కడకు చేరుకున్నారు.
ప్రతి ఒక్కరూ ఊర్వశితో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఊర్వశి సంతోషంగా అందరితో పోజులిచ్చింది. అయితే ఊర్వశి రౌతేలా అభిమానులతో సెల్ఫీలు దిగుతుండగా ఈవెంట్లో ఉన్న ఓ అమ్మాయికి ప్రమాదం తప్పింది. ఈవెంట్లో కేక్ కట్ చేసే సందర్భంలో ఒక అమ్మాయి అక్కడ మండుతున్న కొవ్వొత్తిని ఉంచుతుంది. అది అకస్మాత్తుగా పెద్దగా మండింది. ఇంతలో ఆ అమ్మాయి జుట్టు మంటల్లో కాలిపోయింది. అప్పుడే ఊర్వశి భయపడుతున్నట్లు వీడియోలో కనిపించింది. వెంటనే పక్కనున్న వారు ఆమె జుట్టులో మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ సమయంలో అక్కడున్న వారంతా కొంతసేపు భయాందోళనకు గురయ్యారు.
హిందీ సినిమాల్లో అతి పిన్న వయసులోనే సూపర్ స్టార్ గా ఎదిగారు ఊర్వశి రౌతేలా. ఆమె ‘సింగ్ సాబ్ ది గ్రేట్’తో బాలీవుడ్లో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అయితే ఆమె హిందీతో పాటు తమిళ-తెలుగు మరియు కన్నడ చిత్రాలలో కూడా నటించి మెప్పించింది. చిరంజీవి వాల్తేరు వీరయ్య బాస్ పార్టీ పాటలో కనిపించినప్పటి నుండి ఈ నటి గత కొన్ని రోజులుగా సౌత్ సినిమా వార్తలలో ప్రముఖంగా వినిపిస్తున్నారు. ఇందులో ఆమె డ్యాన్స్, ఎక్స్ప్రెషన్స్ బాగా నచ్చాయి. తన నటనకు, అందానికి చిరంజీవి కూడా అభిమానిగా మారారు.