»Talking Over Mobile For More Than 30 Minutes Linked To Developing Hypertension
Health Tips: ఫోన్ తో 30 నిమిషాలు.. ఎంత ముప్పో తెలుసా?
ఈ రోజుల్లో ఫోన్ చేతిలో లేనివారు చాలా అరుదు అని చెప్పొచ్చు. ఫోన్ లేపోవడం కాదు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లే వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్లు ఉపయోగించడం టెక్నాలజీకి దగ్గరగా ఉండటమని భావిస్తున్నారు. కానీ, ఈ ఫోన్ల కారణంగా మనం ఎన్ని సమస్యలు ఎదుర్కుంటున్నామో ఎవరూ ఊహించడం లేదు.
వారానికి 30 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువసేపు మొబైల్ ఫోన్లో మాట్లాడటం వల్ల అధిక రక్తపోటు లేదా రక్తపోటు వచ్చే ప్రమాదం 12 శాతం పెరుగుతుందని పరిశోధకులు కనుగొన్నారు. ఈరోజుల్లో చాలామంది రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. అందులో చాలామదికి ఈ ఫోన్ ద్వారానే వచ్చి ఉండొచ్చు. ప్రపంచ జనాభాలో దాదాపు మూడు వంతుల మంది 10 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గలవారు మొబైల్ ఫోన్‌ను కలిగి ఉన్నారు. మొబైల్ ఫోన్లు రేడియో ఫ్రీక్వెన్సీ శక్తిని విడుదల చేస్తాయి. ఎక్కువ కాలం ఫోన్లు వాడటం వల్ల రక్త పోటు ప్రమాదం ఎక్కువగా ఉంటుందని సర్వేలో తేలింది. హైపర్‌టెన్షన్ అనేది గుండెపోటు, స్ట్రోక్‌కు ప్రధాన ప్రమాద కారకం. ప్రపంచవ్యాప్తంగా అకాల మరణానికి ఇదే ప్రధాన కారణంమౌతుందని అధ్యయనంలో తేలింది.
చైనాకు చెందిన సదరన్ మెడికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గ్జియాన్‌వూ క్విన్ ఈ అంశంపై ఓ నివేదికను తయారు చేశారు. మొబైల్ ఫోన్ ఎంత సేపు మాట్లాడారన్న అంశంపై గుండె ఆరోగ్య స్థితి ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఒకవేళ అధిక సమయం మొబైల్లో మాట్లాడితే అప్పుడు రిస్క్ ఎక్కువగా ఉంటుందని క్విన్ తెలిపారు. యురోపియన్ హార్ట్ జనరల్.. డిజిటల్ హెల్త్‌లో ఈ రిపోర్టును పబ్లిష్ అయింది. UK బయోబ్యాంక్ నుండి వచ్చిన డేటాను ఉపయోగించి ఫోన్ కాల్లు, కొత్త-ప్రారంభ రక్తపోటు మధ్య సంబంధాన్ని పరిశీలించడానికి, రక్తపోటు లేని 37 నుండి 73 సంవత్సరాల వయస్సు గల మొత్తం 212,046 మంది పెద్దలు ఈ అధ్యయనంలో పాల్గొన్నారట.