WHO : కరోనా(Corona) మహమ్మారి 2020సంవత్సరంలో ప్రపంచాన్ని గడగడలాడించిన విషయం తెలిసిందే. కోవిద్(Covid) దెబ్బకు ప్రపంచమే తలకిందులైపోయింది. తగ్గింది అనుకున్న ప్రతీసారి రూపాన్ని మార్చుకుని విరుచుకుపడుతోంది. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) శుక్రవారం కరోనా పై కీలక ప్రకటన చేసింది. ఇకపై కోవిద్ ప్రపంచ విపత్తు(global disaster) కాదని పేర్కొంది. ప్రస్తుతానికి కరోనా కేసులు తక్కువగానే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే డబ్ల్యూహెచ్‌వో కరోనా వైరస్(Corona Virus) ప్రభావం ప్రపంచ విపత్తుగా పరిగణించేంతటి స్థాయిలో లేదని వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య నిపుణులతో గురువారం కోవిద్(Covid) పై చర్చించి ఈ నిర్ణయానికి వచ్చాయి.
అదే క్రమంలో డబ్ల్యూహెచ్‌వో కోవిడ్ మహమ్మారి పూర్తిగా అంతం కాలేదని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా అది ఇంకా మానవుల ఆరోగ్యానికి ముప్పుగానే ఉందని తెలిపింది. ఇప్పటికీ కరోనా బారిన పడి వందలాది మంది ప్రతీ వారం ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పింది. మహమ్మారి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. దీనిమీద డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనం(WHO Director General Tedros Adhanom) మాట్లాడుతూ.. కోవిడ్ మళ్ళీ మన ప్రపంచాన్ని ప్రమాదంలో పడేసే పరిస్థితి ఉందా? అనే విషయాన్ని మరోసారి కూడా నిపుణులతో సమీక్ష జరిపించడానికి తాను సిద్ధమేనని తెలిపారు.
కోవిడ్ -19(Covid 19) మహమ్మారి మూడేళ్లలో దాదాపు 800 మిలియన్ల మందిని అనారోగ్యం పాలుచేసింది. లక్షలాదిమంది ప్రాణాలు తీసింది. అయితే, ఈ మహమ్మారి ఇకపై ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా పరిగణించబడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. డబ్ల్యూహెచ్ఓ మొదటిసారిగా 30 జనవరి 2020న కోవిడ్‌కి అత్యధిక స్థాయిలో ప్రమాదకర హెచ్చరికను చేసింది. దాని ప్యానెల్ ప్రతి మూడు నెలలకు ఒకసారి కరోనా పై సమావేశాలు నిర్వహిస్తుంది. శుక్రవారం ఎమర్జెన్సీ కమిటీ(Emergency Committee) 15వ సారి సమావేశమైంది.