SKLM: జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు నేర ప్రవృత్తికి స్వస్తి పలికి సత్ప్రవర్తనతో మెలగాలని రణస్థలం పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు ఎస్సై చిరంజీవి సూచించారు. వారికి రణస్థలం స్టేషన్లో ఆదివారం కౌన్సిలింగ్ ఇచ్చారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, ఘర్షణలకు దూరంగా ఉండాలన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు