నెల్లూరు: నగరంలోని దర్గామిట్టలో రాజరాజేశ్వరి ఆలయంలో శ్రావణమాస ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 25 నుంచి ఆగస్టు 23 వరకు శ్రావణ మాస ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈవో జనార్ధనరెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన కరపత్రాలను ఆదివారం గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు.