ATP: కళ్యాణదుర్గం మండలం బోయలపల్లి గ్రామంలో సోమవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి భారీ వృక్షం రోడ్డుపై పడింది. దీంతో కళ్యాణదుర్గం– పావగడ ప్రధాన రహదారిలో ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం తెలుసుకున్న అధికారులు రోడ్డుపై పడిన వృక్షాన్ని తొలగించారు. దీంతో వాహనాల రాకపోకలు సాగాయి.