కృష్ణా: బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ బైపాస్ రోడ్డుపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు ముందు వెళ్తున్న లారీని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన వారిగా గుర్తించారు.