KRNL: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఈనెల 22న మహిళా రక్షణ, హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు జిల్లా మహిళా, శిశు సంక్షేమ సాధికారత అధికారి పి. నిర్మల ఇవాళ పేర్కొన్నారు. దూపాడులోని అశోక ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో మం.1.30 నుంచి సా 5.30 గంటల వరకు కొనసాగనున్న సదస్సుకు ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ హాజరు కానున్నారని తెలిపారు.