NLR: ఉదయగిరి- సీతారాంపురం హైవే జంక్షన్ వద్ద ఇవాళ డివైడర్‌ను ఓ బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు అతనిని అంబులెన్స్‌లో ఉదయగిరి ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి బ్యాగ్‌ను పరిశీలించగా దగదర్తి సచివాలయంలో ఫిషరీష్ అసిస్టెంట్ ఓంకార్ పేరుతో జాయినింగ్ రిపోర్టు ఉందని స్థానికులు తెలిపారు.