»Congress Alleges Plot By Bjp Candidate To Kill Kharge And Family
Congress: కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే హత్యకు కుట్ర..బీజేపీ నేత ఆడియో వైరల్
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను హత్య చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని కాంగ్రెస్ నేత రణ్ దీప్ సుర్జేవా ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ ను కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే( Mallikarjun Kharge) హత్యకు బీజేపీ (BJP) కుట్ర చేస్తోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్ దీప్ సుర్జేవా(Randeep Surjewala )లా ఆరోపించారు. బీజేపీ నేత, చిత్తాపూర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి అయిన మణికంఠ్ రాథోడ్ మాట్లాడిన ఆడియో క్లిప్స్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్(Audio Viral) అవుతోంది. కాంగ్రెస్ (Congress)పార్టీపై ప్రజలు చూపించే అభిమానాన్ని తట్టుకోలేక బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారని సుర్జేవాలా ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ షేర్ చేసిన ఆడియో క్లిప్:
Meet Manikant Rathod, the BJP candidate from Chittapur constituency, who has over 40 criminal cases against him. He also happens to be the "blue-eyed boy" of PM Modi & CM Bommai.
In this viral audio, the BJP leader can be heard saying- *"Will wipe off Kharge's family"*
కర్ణాటకలో ఎన్నికల(Karnataka Elections) సందర్భంగా ప్రచారం సాగుతోంది. ప్రధాన పార్టీలన్నీ ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రజలు బీజేపీ(BJP)ని సరిగ్గా పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్(Congress) పార్టీని ఎంతగానో అభిమానిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే( Mallikarjun Kharge) హత్యకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఖర్గేతో పాటుగా ఆయన కుటుంబాన్ని హత్య చేయడానికి బీజేపీ కుట్ర పన్నుతోందని రణ్ దీప్ సుర్జేవాలా ఆరోపించారు.
#WATCH | BJP leaders are now hatching a plot to murder Mallikarjun Kharge and his family members. This is now clear from the recording of BJP's candidate from Chittapur who also happens to be the blue-eyed boy of PM Modi and CM Bommai: Congress leader Randeep Singh Surjewala… pic.twitter.com/JuKFTYktNy
చిత్తాపూర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మణికంఠ్ రాథోడ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే( Mallikarjun Kharge) హత్యకు ప్లాన్ చేస్తున్నాడని, దానికి సంబంధించి తమ వద్ద ఆడియో క్లిప్ కూడా ఉందని కాంగ్రెస్ తెలుపుతోంది. ప్రధాని మోదీ, సీఎం బొమ్మై ఇద్దరూ కలిసి ఖర్గే హత్యకు కుట్ర పన్నారని కాంగ్రెస్ తెలుపుతోంది. మణికంఠ్ రాథోడ్ పై 40 క్రిమినల్ కేసులు ఉన్నాయని కాంగ్రెస్ వెల్లడించింది. ఈ సందర్భంగా బీజేపీ(BJP) నేత కాల్ రికార్డింగ్ ను కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి పోస్టు చేసింది. ప్రస్తుతం ఆ ఆడియో క్లిప్ వైరల్(Audio Viral) అవుతోంది.