NLG: సుదర్శన క్రియలో సోహం సోహం అనే ప్రక్రియ ప్రత్యేకమైనదని శ్రీనివాస గురూజీ అన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు సారథ్యంలో చిట్యాలలో జరుగుతున్న పద్మసాధన, మెడిటేషన్, సుదర్శన క్రియ శిక్షణ తరగతులకు ఆదివారం ఆయన హాజరయ్యారు. సోహం, సోహం టెక్నిక్ ద్వారా మనిషిలో పాజిటివ్ ఆలోచనలు వస్తాయని, మానసిక ప్రశాంతత పెరుగుతుందన్నారు.