ఓ కన్ స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసే వ్యక్తికి రోబో హెల్ప్ చేసింది. ఆ రోబో పేరు ‘అట్లాస్’. సాయం అంటే ఓ లేబర్ మాదిరిగా వర్క్ చేసింది. రోబోను బోస్టన్ డైనమిక్స్ రూపొందించారు. ఆ వీడియోను ఎంటర్ ప్రైజ్ క్లౌడ్ కంపెనీ బాక్స్ సీఈవో ఆరొన్ లెవి షేర్ చేశారు. వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రోబో చక్కగా ఆడుకుంటూ పనిచేస్తోంది. అదీ రోబోనేనా.. లేదంటే బక్క పలుచని మనిషా అనే సందేహాం కలుగుతుంది.
ఒకతను కన్ స్ట్రక్షన్ వర్క్ చేస్తూ.. రోబోని పిలుస్తాడు. స్కిల్ సెట్ తీసుకురావాలని కోరతాడు. అది అప్పటికే సిద్దం చేసిన ఓ కర్రను వెళ్లేందుకు వేసుకుంటోంది. చక్కగా ఆడుకుంటూ అడిగిన మిషన్ టూల్ తీసుకొస్తుంది. దానిని అతను ఉన్న వద్దకు విసిరికొడుతుంది. రోబో ముందు ఉన్న ఓ టేబుల్‌ను ముందు తోస్తుంది. దాని మీద నుంచి కిందకకు దూకుతుంది. ఇది చక్కని, ఫ్రెండ్లీ రోబట్ అని అతను కామెంట్ చేశారు. ఏదైనా తప్పు చేస్తుందని ఊహించలేమని తెలిపారు.
వీడియోను గురువారం షేర్ చేయగా తెగ వైరల్ అవుతుంది. గత 24 గంటల్లోనే ఇప్పటికే 18 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. వేలాది లైకులు, కామెంట్స్ వస్తున్నాయి. వీడియోను ట్విట్టర్ బాస్ ఎలాన్ మాస్క్ కూడా షేర్ చేశారు. ‘స్వీట్ డ్రీమ్స్’ అని కామెంట్ చేశారు. ఆ రోబో చాలా చక్కగా స్కిల్ విసిరి వేసిందని ఒకరు రాశారు. ఆ రోబో ఆశ్చర్యానికి గురిచేసిందని, కాస్త భయం కూడా వేసిందని మరొకరు అన్నారు. ఇది బ్లాక్ మిర్రర్ ఎపిసోడ్ అంటూ, నెట్ ప్లిక్స్లో సైన్ ఫిక్షన్ సిరీస్ గురించి ఉదహరించి మరొకరు కామెంట్ చేశారు. మరోసారి చూస్తానని, చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుందని మరొకరు రాశారు.