»Rahul Gandhi After Ammananna Kannada Actress Ramya
actress Ramya : అమ్మానాన్న తర్వాత రాహుల్ గాంధీనే : కన్నడ నటి రమ్య
కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ పై కన్నడ నటి (Kannada actress), మాజీ ఎంపీ దివ్య స్పందన (రమ్య) (Ramya) సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు ఆమె తెలిపారు. తన తండ్రి చనిపోయాక తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని ఆ సమయంలో తనకు కాంగ్రెస్ నేత రాహుల్ (Rahul)మద్దతుగా నిలిచారని రమ్య గుర్తు చేసుకున్నారు. ఈ విషయాలను తాజాగా ఓ కన్నడ టాక్ షోలో పంచుకున్నారు.
కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ పై కన్నడ నటి (Kannada actress), మాజీ ఎంపీ దివ్య స్పందన (రమ్య) (Ramya) సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు ఆమె తెలిపారు. తన తండ్రి చనిపోయాక తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని ఆ సమయంలో తనకు కాంగ్రెస్ నేత రాహుల్ (Rahul)మద్దతుగా నిలిచారని రమ్య గుర్తు చేసుకున్నారు. ఈ విషయాలను తాజాగా ఓ కన్నడ టాక్ షోలో పంచుకున్నారు. కాంగ్రెస్ ఇప్పుడంటే వృద్ధాప్య పార్టీగా, పేలవమైన పనితీరుతో కనిపిస్తుందీ కానీ. స్వాతంత్యం రాకముందు నాటి నుండి ప్రధాని మోదీతో(Prime Minister Modi) కూడిన బీజెపీ అధికారంలోకి వచ్చేంత వరకు ఆ పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అయితే పలు రాష్ట్రాల్లో అధికారం కోల్పోతూ నీరసంలో కూరుకుపోతున్న కాంగ్రెస్‌లో జవసత్వాలు నింపేందుకు ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) కొంత ప్రయత్నాలు చేస్తున్నారు. భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)పేరుతో కన్యాకుమారి (Kanyakumari) నుండి కాశ్మీర్ పర్యటన చేశారు.
అయితే రాహుల్ గాంధీనుద్దేశించి ఓ నటి పలు చేశారు. నిదరే కల అయినదీ, కలయే నిజమైనది! బతుకే జత అయినదీ, జతయే అతనన్నది’ సూర్య సన్నాఫ్ కృష్ణన్ లో ఈ పాట ప్రతి ఒక్కరికీ ఇష్టమే. ఆ పాటలో నటించిన హీరో హీరోయిన్లు తమిళ నటుడు సూర్య(Tamil actor Surya), నటి రమ్య అలియాస్ దివ్య స్పందన. ఆ పాటలో ఆమె చాలా క్యూట్ గా కనిపిస్తారు. రమ్య కన్నడ నటి. దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Rajkumar) అభి సినిమాతో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు దివ్య స్పందన. కాగా, తెలుగులో సైతం కళ్యాణ్ రామ్ నటించిన అభిమన్యుతో పాటు అమృత వర్షం అనే సినిమాలో నటించారు. అయితే తమిళ్, కన్నడ, హిందీ సినిమాల్లో ఎక్కువగా కనిపించారు. అనంతరం ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2012లో కాంగ్రెస్ లో చేరిన రమ్య.. కర్ణాటకలోని మాండ్య (Mandya) నియోజకవర్గం నుండి లోక్ సభ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే ఇటీవల తన జీవితంలో ఎదురైన చేదు సంఘటనలు గురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.‘మా నాన్న చనిపోయిన రెండు వారాలకు పార్లమెంటుకు వెళ్లాను. అక్కడ నాకు ఎవరూ, ఏమీ తెలియదు. కనీసం పార్లమెంట్ ప్రొసీడింగ్స్ కూడా తెలీదు.
క్రమంగా ప్రతిదీ నేర్చుకున్నాను. నా బాధను నా పని వైపు మళ్లించాను. మాండ్యా (Mandya) ప్రజలు నాకు ధైర్యాన్ని ఇచ్చారు’’ అని చెప్పుకొచ్చారు.‘‘మా అమ్మ నన్ను అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి. ఆ తర్వాత నాన్న. మూడో వ్యక్తి రాహుల్ గాంధీ. నాన్న చనిపోవడం, ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆత్మహత్య గురించిన ఆలోచనలు వచ్చేవి. ఆ సమయంలో రాహుల్ గాంధీ నాకు అండగా నిలిచారు’’ అని వివరించారు. 2012లో యూత్ కాంగ్రెస్ (Youth Congress) లో చేరిన రమ్య.మాండ్యా ఎంపీ సీటుకు జరిగిన ఉప ఎన్నికలో గెలిచారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. తర్వాత కాంగ్రెస్ సోషల్ మీడియా(Congress social media)హెడ్ గా నియమితులయ్యారు. కానీ కొన్నాళ్లకు రాజీనామా చేశారు. గతేడాది సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి, నిర్మాణ సంస్థ ప్రారంభించారు. అయితే సినిమల్లో మాత్రం ‘రమ్య’గానే ఎక్కువ మందికి ఈమె తెలుసు.