జాతిరత్నాలు సినిమాతో హీరో నవీన్ పోలిశెట్టికి ఎంత గుర్తింపు వచ్చిందో.. డైరెక్టర్ అనుదీప్‌కు కూడా అంతే క్రెడిట్ దక్కింది. దాంతో నెక్ట్స్ తెలుగు, తమిళ్లో ‘ప్రిన్స్'(prince) అనే సినిమాను గ్రాండ్ ప్లాన్ చేశాడు అనుదీప్. ‘డాక్టర్’, ‘డాన్’ సినిమాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న శివకార్తికేయన్(shiva kartikeya).. ఇప్పుడు స్ట్రెయిట్ ఫిల్మ్ ‘ప్రిన్స్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఈ సినిమాలో ఉక్రెయిన్ బ్యూటీ మరియా హీరోయిన్గా నటిస్తోంది. అక్టోబర్ 21వ తేదీన ‘ప్రిన్స్’ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ మొదటు పెట్టిన చిత్ర యూనిట్.. తెలుగులో గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 18న, అంటే ఈ రోజు సాయంత్రం 6 గంటల నుండి హైదరాబాద్‌లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కు రౌడీ హీరో విజయ్ దేవరకొండ(vijay deverakonda), రానా దగ్గుబాటి(rana daggubati) ముఖ్య అథితులుగా రాబోతున్నారు.
అలాగే డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా రాబోతున్నారు. దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు మేకర్స్. దాంతో ప్రిన్స్ ఈవెంట్ ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే లైగర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ వస్తున్న ఈవెంట్ ఇదే కానుంది. మధ్యలో అవార్డ్ ఫంక్షన్లో కనిపించినప్పటికీ లైగర్ పై పెద్దగా స్పందించలేదు విజయ్. అందుకే ప్రిన్స్ స్టేజ్ పై రౌడీ స్పీచ్ ఇంట్రెస్టింగ్గా మారనుంది. ఇక శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ ఎల్ఎల్పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి.. థమన్ సంగీతాన్ని అందించాడు.