మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన చేసే పనులు కూడా అలానే ఉన్నాయి. షర్మిల పార్టీలోకి అతను మారే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. ఈ క్రమంలో… బీఆర్ఎస్ లోని కొందరు పొంగులేటి సన్నిహితులను పార్టీలోకి సస్పెండ్ చేశారు. ఈ విషయమై… తాజాగా ఆయన స్పందించారు.
వాళ్లను, వీళ్లను సస్పెండ్ చేయడం కాదని.. దమ్ముంటే తనను సస్పెండ్ చేయాలని ఆయన సవాల్ విసిరారు. తనను కొద్దిరోజుల క్రితం వరకు పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించారని ఆయన గుర్తు చేశారు. వారి గెలుపు కోసం నన్ను ప్రాధేయపడ్డారని అన్నారు. తనకు బీఆర్ఎస్ సభ్యత్వం లేదని ఎవరో అంటున్నారట అని వ్యాఖ్యానించిన పొంగులేటి.. అలాంటప్పుడు డిసెంబర్ వరకు పార్టీ కార్యక్రమాల్లో తన ఫోటో ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. తనను నమ్ముకున్న అభిమానుల అభీష్టం మేరకే పార్టీ మార్పు ఉంటుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.