BDK: సీతమ్మ సాగర్ భూనిర్వాసిత రైతుల సమస్యలపై బుధవారం భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావుకు వినతిపత్రం సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ పినపాక నియోజకవర్గ సీనియర్ నాయకుడు గాదె కేశవరెడ్డి ఆధ్వర్యంలో అశ్వాపురం, చర్ల, దుమ్ముగూడెం, మణుగూరు మండలాల రైతులు కలిశారు. సీతమ్మ సాగర్ పనుల్లో ధ్వంసం అయిన మోటర్లు, పైపులైన్లు వల్ల మిగిలిపోయిన భూములకు సాగునీటి సౌకర్యం లేదన్నారు.
BHNG: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఆలయంలోని మహా మండపంలో బుధవారం స్వామివారిని అమ్మవార్లను నూతన వస్త్రాలు, పూలతో అలంకరించి, వేద మంత్ర పారాయణంలో ఉదయం 10 గం. నుంచి మొదలుకొని సుమారు రెండు గంటల పాటు శ్రీవారి కల్యాణ తంతు నిర్వహించారు. భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
NLG: నల్గొండలోని అంబేడ్కర్ భవన్ లో ఈరోజు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అధ్యక్షుడు బైరీ నరేశ్ ఆధ్వర్యంలో ఆదర్శ వివాహం (కులాంతర) చేశారు. పెళ్లి అనే బంధం ఈ సమాజాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ఉండాలని.. సమాజానికి ప్రాథమిక మెట్టు కుటుంబం అన్నారు. ఆదర్శ వివాహాలు చేయడానికి వేదికలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
మహిళ తన శరీరాన్ని ఏం చేయాలనే దానిని ప్రభుత్వం చెప్పకూడదని అమెరికా అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ అన్నారు. అబార్షన్ చట్టాలకు వ్యతిరేకంగా తన వైఖరి స్పష్టమని చెప్పారు. అబార్షన్ హక్కులపై కాంగ్రెస్ లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు సంతోషంగా సంతకం చేశానని చెప్పుకొచ్చారు. అబార్షన్ విషయంలో మహిళలు ఏం చేయాలో చెప్పకూడదన్నారు. ఈ చట్టాలతో చాలామంది ఇబ్బందులు పడటం చూశానని.. కొందరు ఏకంగా ప్రాణాలు కోల్పోయారని పేర్కొన...
NLR: ఉదయగిరి నుంచి గండిపాలెం వెళ్లే ప్రధాన రహదారికి మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. ప్రధాన రహదారిపై అక్కడక్కడ గుంతలు ఏర్పడడంతో ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు మార్జిన్లు కూడా కోతకు గురై ప్రమాదకరంగా ఉన్నాయన్నారు. R&B అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరారు.
NLR: మనుబోలు మండల కేంద్రంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ట్రాన్స్‌కో ఏఈ అనిల్ కుమార్ తెలిపారు. బుధవారం మనుబోలు, కోదండరామపురం, అరుంధతి వాడ, బీసీ కాలనీలలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ఆయన పరిశీలించారు. లోడ్ ఎక్కువ కావడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కలుగుతున్నాయని అన్నారు.
AP: కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ ఈవీఎంలపై సంచలన ఆరోపణలు చేశారు. ఈవీఎం ట్యాంపరింగ్ వందశాతం జరుగుతుందన్నారు ఎలన్ మస్క్ వంటి టెక్ నిపుణులు సైతం ఈ విషయాన్ని చెప్పారని గుర్తు చేశారు. ప్రతిపక్షాలను దెబ్బతీసేందుకు అధికార పార్టీ చేసే ప్రయోగమన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యం నిలబడాలంటే బ్యాలెట్ పోలింగ్ విధానం కావాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాల్లోనే బ్యాలెట్ ఓటింగ్ జరుగుతుందన...
JGL: మెట్‌పల్లి పట్టణం వెంకట్రావుపేటలోని పెద్డ చెరువులో ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ చేప పిల్లలని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ప్రభుత్వం చేపలు పట్టే వృత్తిపై ఆధారపడి బతికే మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు, మత్స్యకారులు ఆర్థికంగా బలపడడానికి చేప పిల్లలు ఉచితంగా ఇవ్వడం ప్రారంభించిందన్నారు.
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు ప్రెస్‌మీట్ ద్వారా కేబినెట్‌లో చర్చించిన వివరాలు వెల్లడించనున్నారు. దాదాపు 3 గంటలుగా సమావేశం కొనసాగింది. మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. అందులో దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.
MBNR: మిషన్ భగీరథ కార్య నిర్వాహక ఇంజనీర్ ఇంట్రా, గ్రిడ్ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి బుధవారం సందర్శించారు. మిషన్ భగీరథ ఇంట్రా, గ్రిడ్ కార్య నిర్వాహక కార్యాలయాలు, సిబ్బంది, పని తీరు గురించి తెలుసుకున్నారు. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ లాబరేటరీని కలెక్టర్ పరిశీలించారు. మిషన్ భగీరథ నీటి సరఫరాలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
NLR: సాగు భూమి కొరకు ఏఎస్.పేట తాహసిల్దార్ కార్యాలయంలో ఆ గ్రామానికి చెందిన పలు ముస్లిం మైనారిటీ కుటుంబాలు అర్జీలు అందించారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో బుధవారం దరఖాస్తులు అందజేశారు. తమ బతుకులు బాగుపడాలంటే సాగు కోసం వ్యవసాయ భూములు అందించాలని వారు ఈ సందర్భంగా తెలిపారు.
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, జూ.ఎన్టీఆర్ కాంబోలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తోన్న మూవీ ‘వార్ 2’. ప్రస్తుతం ఎన్టీఆర్, హృతిక్‌పై వచ్చే కత్తిసాము సీక్వెన్స్ షూటింగ్ జరుగుతుందట. కత్తిసాముతో హృతిక్ ఇంట్రడక్షన్, ఓ నౌకపై సముద్రపు దొంగల ఫైట్ సీక్వెన్స్‌తో తారక్ ఎంట్రీ ఉండనున్నట్లు తెలుస్తోంది. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోన్న ఈ మూవీ 2025 ఆగస్టు 15న విడుదల కానుంది....
SKLM: గార తహసీల్దార్ కార్యాలయంలో ఈనెల 25న ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించినట్లు ఎమ్మెల్యే గొండు శంకర్ బుధవారం తెలిపారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5:00 వరకు అర్జీదారుల నుండి వినతులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని గమనించి, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి మండలంలో ఉన్న ప్రభుత్వ అధికారులంతా హాజరుకావాలన్నారు.
NDL: చదువుతోపాటు క్రీడల్లోనూ ఆసక్తి చూపించాలని బ్రాహ్మణకొట్కూరు ఎస్ఐ తిరుపాలు అన్నారు. బుధవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. అనంతరం జిల్లా స్థాయి బాలుర కబడ్డీ పోటీలకు ఎంపికైన 10వ తరగతి విద్యార్థి మధుసూదన్‌ను ఎస్ఐ అభినందించారు. భవిష్యత్తులో రాష్ట్రస్థాయికి కూడా ఎన్నిక కావాలని ఆయన ఆకాంక్షించారు.