హీరో అల్లు అర్జున్ కాసేపట్లో నాంపల్లి కోర్టుకు వెళ్లనున్నారు. సంధ్య థియేటర్ కేసులో నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కి 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇదే కేసులో హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇవాళ్టితో కస్టడీ సమయం ముగుస్తుంది. దీంతో నాంపల్లి కోర్టుకు హాజరై బెయిల్ వివరాలు కోర్టుకు తెలపనున్నారు.