SKLM పెండింగులో ఉన్న ఈ-చలానాలు చెల్లించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా బుధవారం తెలిపారు. ఈనెల 13న జరగనున్న జాతీయ లోక్ అదాలతో ఇటువంటి సమస్యలు పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. ఈ చలానాలు కట్టని వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఈ లోక్ అదాలకు పోలీసులు హాజరు కావాలన్నారు.
VKB: జిల్లాలో నేడు సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో షెడ్యూల్ ప్రకారం 8 మండలాల పరిధిలోని 262 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 39 వరకు GPలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో గురువారం మిగతా గ్రామాల్లో పోలింగ్ జరగనుంది. 2198 వార్డులకు సభ్యులను ఎన్నుకోవాల్సి ఉండగా.. ఇక్కడా కొందరు ఏకగ్రీవం అయ్యారు. 8 మండలాల్లో మ. ఒంటిగంటతో పోలింగ్ ముగుస్తుంది.
తూ.గో: ధాన్యం కొనుగోలులో గోనె సంచులు, రవాణా, కొలతలు, చెల్లింపులు వంటి అన్ని అంశాల్లో పారదర్శకత ఉండాలని జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి వీసీ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ఫిర్యాదులు అందిన నేపథ్యంలో క్షేత్ర స్థాయి అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు.
VZM: 2010కి ముందు విధుల్లో చేరిన టీచర్లకు TET పరీక్షల నుంచి మినహాయింపు ఇవ్వాలని UTF రాష్ట్ర నాయకులు కె.విజయగౌరి డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం డిప్యూటీ DEO కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.TET పరీక్షలు రద్దుకు రివ్యూ పిటిషన్ వేయాలని, విద్యాహక్కు చట్టం సెక్షన్-23లో మార్పులు చేయాలని కోరారు. ఈనెల18న కలెక్టరేట్ వద్ద ధర్నాను జయప్రదం చేయాలన్నారు.
KDP: ఎర్రగుంట్ల- ముద్దునూరు రోడ్డులో గల జిల్లా పరిషత్ పాఠశాల వద్ద ఇద్దరూ యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా మృతి చెందిన యువకులు మహారాష్ట్రకు చెందిన వినాయక్ శర్వాన్ చౌదరి (34), కిరణ్ విలాస్(23)గా గుర్తించారు. వీరు జువారి సిమెంట్ కర్మాగారంలోని ఓ కాంట్రాక్టర్ వద్ద లేబర్ పనిచేస్తున్నారు. వ్యక్తిగతపని నిమిత్తం వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
HNK: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్ మండలాల్లో కలిపి 266, సర్పంచి అభ్యర్థులు ఉండగా.. 1,117 వార్డు మెంబర్స్ బరిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉ. 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది.
SRD: జిల్లాలోని ఏడు మండలాల్లో 129 పంచాయతీల్లో జరిగే ఎన్నికలకు పోలీస్ శాఖ భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసింది. 7 మంది సీఐలు, 28 మంది ఎస్సైలు, 16 మంది పోలీసు అధికారులు, 1,120 మంది కానిస్టేబుళ్లను బందోబస్తుకు సిద్దం చేసింది. వారు ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం నుంచి కౌంటింగ్ ముగిసే వరకు ఆయా కేంద్రాల వద్ద బందోబస్తు విధులు నిర్వహిస్తారు.
అన్నమయ్య: అన్న క్యాంటీన్‌లో పేదలకు అందించే ఆహారంలో ఎలాంటి లోపాలూ లేకుండా, రుచిగా, శుభ్రంగా ఉండాలని టీడీపీ ఇన్‌ఛార్జ్ చమున్ జగన్ మోహన్ రాజు ఆయన్నాకిస్టుతోంగా తనిఖీ చేసిన వివరించారు. ఎంత మందికి టోకెన్లు ఇస్తున్నారు, ఇతర వివరాలను సిబ్బందిని అదిగి తెలుసుకున్నారు. పేదలకోసం ప్రభుత్వం రూ.5 లక్షల ఆల్యావాహారం, భోజన కార్యక్రమం కల్పిస్తున్నదన్నారు.
MLG: ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి 18 రకాల ధ్రువపత్రాల్లో దేనినైనా ఉపయోగించుకోవచ్చని కలెక్టర్ దివాకర్ టీఎస్ అన్నారు. ఎన్నికల సంఘం సూచనల మేరకు ఎలక్షన్ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, పాన్ కార్డు, ఇండియన్ పాస్పోర్ట్, ఫొటోతో కూడిన కుల ధృవీకరణ పత్రం, చూపించి ఓటు వేయవచ్చని తెలిపారు.
తిరుమల కల్తీ నెయ్యి కేసు సిట్ కస్టడీలో రెండో రోజు ముగిసింది. అధికారులు అడిగిన ప్రశ్నలకు అజయ్ కుమార్ సుగంధ్ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని సమాచారం. మైసూరు రిపోర్ట్ వచ్చాక ఎవరికి చెప్పారు. కల్తీ అని తెలిసినా ఎందుకు తప్పు చేశారు. వారు ఇచ్చే కమీషన్లకు ఎందుకు తలొగ్గారు. అని సుబ్రహ్మణ్యాన్ని ప్రశ్నించారు. ఈయన కొన్నింటికి సమాధానాలు ఇవ్వలేదని తెలుస్తోంది.
CTR: ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూక్తిని ప్రతి ఒక్కరూ పాటించి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని MLC కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు. కుప్పం GHలో ఉచిత డయాబెటిస్ ఫుట్ చెకప్ వైద్య శిబిరాన్ని MLC ప్రారంభించారు. ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. శిబిరంలో సుమారు వందమందికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
ప్రకాశం: పామూరులోని స్థానిక అయ్యప్పస్వామి దేవస్థానంలో బుధవారం రాత్రి అయ్యప్పస్వామి మహా అంబలి పూజను నిర్వాహకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని పామూరులోని ఐదు అశ్వాలతో ఊరేగింపుగా దేవస్థానంలోకి తీసుకువచ్చారు. అనంతరం దేవస్థాన ఆవరణలో అయ్యప్పస్వామి భజనను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
CTR: కుప్పం మున్సిపాలిటీ పరిధిలో ఎలక్ట్రిక్ సైకిళ్ల గురించి ప్రజలకు టీడీపీ శ్రేణులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. 10వ క్లస్టర్‌కు చెందిన 2వ సచివాలయంలో ఎలక్ట్రిక్ సైకిళ్లపై గంగమ్మ గుడి మాజీ ఛైర్మన్ ఆర్ఆర్ రవి, టీడీపీ నేత మంజునాథ్,తదితరులు ప్రజలకు అవగాహన కల్పించారు. రూ. 5000 చెల్లించి ఎలక్ట్రిక్ సైకిల్ తీసుకుంటే సులభతరంగా నెలవారీ EMI కట్టుకోవచ్చన్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొదటి విడత GP ఎన్నికలు నేడు జరగనున్నాయి. ఓటరు మహాశయులారా ఇక సిద్ధమవ్వండి. మీరు ఎక్కడున్నా సరే సొంతూరులో ఓటు హక్కు ఉంటే తప్పకుండా వచ్చి ఓటేయండి. మహబూబ్‌నగర్ జిల్లాలో 139, గద్వాల -106, నారాయణపేట -67, వనపర్తి – 87, నాగర్‌కర్నూల్ – 151 పంచాయతీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. పలుచోట్లు ఏకగ్రీమయ్యాయి.
కోనసీమ: సీఎం చంద్రబాబు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్‌కు 21 వ ర్యాంక్ కేటాయించారు. రాష్ట్ర కలెక్టర్ల గత మూడు నెలల పనితీరు ఆధారంగా ఈ ర్యాంకులో కేటాయించినట్లు తెలుస్తుంది. జిల్లా కలెక్టర్ గత మూడు నెలల్లో 206 ఫైల్ లు స్వీకరించి 178 ఫైల్ లను పరిష్కరించారు. ఈయన పని తీరుకు 21 వ ర్యాంక్ కేటాయించారు.