CTR: పుంగనూరు మండల పరిధిలోని ఉలవలదిన్నె గ్రామానికి చెందిన తేజస్వినికి.. ముల్లాబగల్‌కు చెందిన నవీన్‌తో ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. భర్త, వారి కుటుంబ సభ్యులు అదనపు కట్నం తేవాలని నిత్యం వేధిస్తున్నారని ఆమె ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హరిప్రసాద్ తెలిపారు.
MHBD: కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని ఎమ్మెల్యే రామచంద్రనాయక్ అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో దంతాలపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే ఉదయం నుంచి రాత్రి వరకు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సర్పంచ్ స్థానాలను కైవాసం చేసుకోవాలన్నారు.
NRPT: సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాండూర్ రెవెన్యూ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న దామరగిద్ద మండలం కానుకుర్తి గ్రామానికి చెందిన నారాయణ రాజీనామా చేశారు. మరో 13 నెలలు సర్వీస్ ఉండగానే వీఆర్ఎస్ తీసుకున్నారు. కానుకుర్తి గ్రామ సర్పంచ్ పదవికి ఆయన పోటీ చేస్తున్నారు. పుట్టిన ఊరికి సేవ చేయడమే ధ్యేయం అని ఆయన చెప్పారు.
కోనసీమ: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం సోమవారం అమలాపురం కలెక్టరేట్లో యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదివారం తెలిపారు. జిల్లా స్థాయిలోనే కాకుండా ఆర్డీవో కార్యాలయాలు, ఎంపీడీవో, తహశీల్దార్, మున్సిపల్ కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలన్నారు.
SRD: పటాన్‌చెరు మండలంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. భానురు గ్రామంలో మొత్తం 14 వార్డుల్లో 7,084 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 3,515, మహిళలు 3,569 మంది. ఎన్నికల్లో కాంగ్రెస్ -బీఆర్ఎస్ పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. గ్రామంలో ఇరుపార్టీలు ఇంటింటికీ వెళ్లి ప్రచారాన్ని మరింత వేగవంతం చేస్తూ ఓటర్ల మద్దతు కోసం శ్రమిస్తున్నాయి.
TPT: రేణిగుంట ప్రధాన రహదారిపై సీఆర్ఎస్ రైల్వే ఆసుపత్రి ఎదురుగా స్పీడ్ బ్రేకర్ వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగిది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల వివరాల మేరకు.. తిరుపతి నుంచి వస్తున్న కారును వెనుక నుంచి స్కూటర్ ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా,వెనుక వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి.
BDK: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సీపీఐ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి మర్రికృష్ణ విజ్ఞప్తి చేశారు. సీపీఐ అభ్యర్థుల గెలుపు గ్రామాభివృద్ధికి దోహదపడుతుందని ఓటర్లను కోరారు. కొత్తగూడెం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల ఆటో అడ్డాల కార్మికులు బేషరతుగా మద్దతు పలకాలని ఆయన తెలిపారు.
జీలకర్రలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. జీలకర్ర నీళ్లు తాగడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గ్యాస్, ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యల నుంచి రిలీఫ్ కలిగి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువు అదుపులో ఉంటుంది. చర్మ ఆరోగ్యం మెరుగుపడి కాంతివంతంగా మారుతుంది. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. శరీరం డిటాక్సిఫై అవుతుంది.
KKD: కాకినాడ మండలం నేమాం గ్రామశివారు శ్మశానవాటిక ప్రాంతంలో ఆదివారం సాయంత్రం జూదం ఆడుతున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ గణేష్ కుమార్ తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 1600 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. సంక్రాంతి పండగ సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో జూదం, కోడిపందేల నిర్వహణపై గాలింపు చర్యలు చేపడుతున్నామన్నారు.
CTR: కుప్పం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పీడీ వికాస్ మరమ్మత్ ఆదేశాల మేరకు శాంతిపురం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తాత్కాలిక పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాపలాదారు, పారిశుద్ధ్య కార్మికురాలి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వైద్యాధికారి వంశీకృష్ణ తెలిపారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
ADB: హైదరాబాద్‌లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అదివారం జరిగిన అండర్ 19 రాష్ట్రస్థాయి బాలురు, బాలికల ఖో ఖో ఫైనల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్లు విజయం సాధించాయి. బాలుర జట్టు రంగారెడ్డి జిల్లాపై, బాలికల జట్టు నల్లగొండ జిల్లాపై గెలుపొందాయి. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా డీఐఈఓలు విద్యార్థులను, కోచ్, ఎస్టీఎఫ్ కార్యదర్శి బాబురావును అభినందించారు.
TG: రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో 8.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్ 11, హన్మకొండ 12, పటాన్‌చెరు 12.6, హయాత్‌నగర్ 13, రాజేంద్రనగర్ 14.5, నిజామాబాద్ 14.8, దుండిగల్ 15.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. అలాగే.. రానున్న రెండు, మూడు రోజుల్లో రాష్ట్రంలో మరింత చలి తీవ్రత పెరగనున్నట్లు తెలిపారు.
సత్యసాయి: మడకశిరకు గర్వకారణమైన క్రికెటర్ కుమారి దీపిక మహిళల T–20 వరల్డ్‌కప్‌లో భారత విజయంలో కీలక పాత్ర పోషించడంతో, ఆమెకు సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు మడకశిర ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఘన సన్మానం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి సవిత, జిల్లా కలెక్టర్ ఎ.శ్యాంప్రసాద్, సినీ నటుడు సాయి కుమార్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
సత్యసాయి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల నేతృత్వంలో “అటల్ మోదీ సంకల్ప యాత్ర” రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుంది. ఈ యాత్ర ఈ నెల 11న ధర్మవరంలో ప్రారంభమై, అదే రోజు అనంతపురానికి చేరుకోనుంది. 12న అనంతపురం నుండి కర్నూలుకు ప్రయాణం కొనసాగుతుంది. బస్సు యాత్రలో బహిరంగ సభలు, ప్రజాసమస్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పార్టీ కార్యాలయం తెలిపింది.