E.G: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు తగరం సురేష్‌బాబు ఆధ్వర్యంలో కార్యక్రమం శనివారం జరిగింది. బాబాసాహెబ్ సేవలను గుర్తించి భరతరత్న బహుమతి బీజేపీ ప్రభుత్వం ఇవ్వడాన్ని నాయకులు ప్రస్తావించారు. సీనియర్ నాయకులు రంగ బాబు, కందికొండ రమేష్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.
ఇండిగో విమాన కార్యకలాపాలు గందరగోళంలో పడిన నేపథ్యంలో కేంద్రం చర్యలకు సిద్ధం అవుతోంది. సంస్థ CEO పీటర్ ఎల్బర్స్‌ను తొలగించే యోచనలో ఉన్నట్లు సమాచారం. DGCA అమల్లోకి తెచ్చిన FDTL నిబంధనలను పాటించలేకపోవడం వల్ల ఇండిగో సర్వీసులు భారీ రద్దవుతున్న విషయం తెలిసిందే. నిబంధనలను తాత్కాలికంగా నిలిపివేసిన కేంద్రం.. CEOపై చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.
WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని బజ్జు తండా గ్రామపంచాయతీ BRS సర్పంచ్ అభ్యర్థిగా ఇవాళ జాటోతు రవిని సర్పంచ్‌గా ఏకగ్రీయంగా ఎంపిక చేసుకున్నారు. ఎంపికకు సహకరించిన ప్రజలకు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి, మండల నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
SRCL: వేములవాడ పట్టణంలో కోరుట్ల బస్టాండ్ లో నూతనంగా ఏర్పటుచేసిన భీమన్న మెడికల్ ఫార్మసీ నీ శనివారం ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు..వారు మాట్లాడుతూ యువత ఉద్యోగాల తో పాటు స్వయం ఉపాధి వైపు మొగ్గు చూపాలని కోరారు.. నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు..ఈ కార్యక్రమంలో కాంగ్రె పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
GDWL: ఆదిశిలా క్షేత్రం మల్దకల్ స్వయంభు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర( తిమ్మప్ప) స్వామి దేవాలయానికి ఓ భక్తుడు వెండి వస్తువులు విరాళం అందజేశాడు. మల్దకల్ మండలంలోని తాటికుంట గ్రామానికి చెందిన పారిజాతమ్మ, వెంకటేష్ దంపతులు, 250 గ్రాముల వెండి చెంబు, గ్లాసులను శనివారం ఆలయ అధికారులకు బహుకరించారు. ఈ సందర్భంగా ఆలయ ఛైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు వారిని సన్మానించారు.
కడపలోని స్టేట్ గెస్ట్ హౌస్‌లో శనివారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి, కడప జిల్లా పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ శ్రీ కె. శ్రీనివాస రెడ్డిని, జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తికి ఎస్పీ పుష్పగుచ్ఛం అందజేసి సాదరంగా స్వాగతం పలికారు.
SRCL: ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామ గుట్టపల్లి చెరువు తండాకు చెందిన వ్యక్తి సౌదీలో గుండెపోటుతో మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. గుగులోతు రవి అనే వ్యక్తి బతుకుదెరువు కోసం విజిట్ వీసా మీద ఆరు నెలల క్రితం సౌదీ వెళ్లాడు. శనివారం ఉదయం 11 గంటలకు గుండెపోటుతో మృతి చెందినట్లు అక్కడివారు కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతదేహం త్వరగా స్వగ్రామం వచ్చేటట్లు చూడాలని KTRను వేడుకుటుంది.
స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ సౌతాఫ్రికాతో జరగబోయే 5 మ్యాచ్‌ల T20 సిరీస్‌లో బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో అతడు పూర్తి ఫిట్‌నెస్‌ను సాధించాడు. దీంతో ఈ నెల 9 నుంచి జరగబోయే టీ20 సిరీస్‌లో ఆడటానికి మార్గం సుగమమైంది. అలాగే.. పాండ్యా, బుమ్రా కూడా ఈ సిరీస్‌లో రీఎంట్రీ ఇవ్వనున్నారు.
JGL: జగిత్యాల అర్బన్ మండలం అంబారిపేట గ్రామ సర్పంచ్ గా గోడిసెల గంగాధర్ శనివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి అభినందనలు అందుకున్నారు. ఎమ్మెల్యే గంగాధర్‌ను శాలువాతో సత్కరించి, అభినందించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర ఆలయ ఛైర్మెన్ తక్కురీ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం రూరల్ మండలం దారేడు గ్రామపంచాయతీని సీపీఐ పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్, సీపీఐ పొత్తులో భాగంగా సీపీఐ అభ్యర్థి బత్తుల వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా శనివారం ఎన్నికయ్యారు. తన ఏకగ్రీవ ఎన్నిక కోసం కృషి చేసిన సీపీఐ, కాంగ్రెస్ నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
PDPL: ఇటీవల నూతనంగా ప్రారంభించిన PDPL(R) పోలీస్ స్టేషన్ను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సందర్శించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామాలలో ఎన్నికల సరళి గురించి, నామినేషన్ కేంద్రాల(క్లస్టర్ల) వద్ద బందోబస్తు గురించి, సమస్యత్మక పోలింగ్ కేంద్రాలు ఎన్ని ఉన్నాయోనని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పలు సూచనలు చేస్తూ జాగ్రత్తలు పాటించాలన్నారు.
NDL: బేతంచర్లలో ధరణి కాలనీలో నివాసం ఉంటున్న వెటర్నరీ అసిస్టెంట్ హసన్ మియాను మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పరామర్శించారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారన్న విషయం తెలుసుకున్న బుగ్గన, ఆయన ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా ఎంపీపీ నాగభూషణం రెడ్డి, నగర పంచాయతీ ఛైర్మన్ చలం రెడ్డి, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
విశాఖ వన్డేలో సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ సెంచరీతో మెరిశాడు. కేవలం 80 బంతుల్లోనే 8 ఫోర్లు, 6 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో భారత్ గడ్డపై వన్డేల్లో 7 సెంచరీలు నమోదు చేసుకున్నాడు. ఓవరాల్‌గా అతడి వన్డే కెరీర్‌లో ఇది 23వ సెంచరీ. అలాగే, వికెట్ కీపర్లలో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ప్లేయర్‌గా సంగక్కర(23) సరసన నిలిచాడు.
ATP: కళ్యాణదుర్గం వైసీపీ సమన్వయకర్త తలారి రంగయ్య శనివారం యాటకల్లు మాజీ సర్పంచ్ రామదాసును పరామర్శించారు. అనారోగ్యంతో ఉన్న విషయం తెలుసుకున్న రంగయ్య, రామదాసు స్వగృహానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యులు సూచించిన చికిత్స వివరాలపై ఆరా తీశారు. రామదాసు త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా రంగయ్య ఆకాంక్షించారు.
TG: నల్గొండ జిల్లా దేవరకొండకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. దేవరకొండలో ప్రజాపాలన, ప్రజావిజయోత్సవ, అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే బాలు నాయక్ హాజరయ్యారు.