• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రేపు విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఉచిత కంటి వైద్య శిబిరం

CTR: పుంగనూరు విశ్రాంత ఉద్యోగుల భవనంలో రేపు (శనివారం )ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు మునస్వామి మొదలి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు శిబిరం ప్రారంభమవుతుందని అన్నారు. శంకర్ నేత్రాలయ ఆసుపత్రి నుండి వైద్యులు వచ్చి ఉచితంగా కంటి పరీక్షలు చేసి అవసరమైన వారిని ఆపరేషన్లకు ఎంపిక చేస్తారని తెలిపారు.

December 27, 2024 / 09:35 AM IST

కేసీఆర్‌ని కలిసిన డీసీసీబీ డైరెక్టర్

మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లా, డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి, మాధవి దంపతుల కుమారుడు ఆదిత్య రెడ్డి, కూతురు సహస్ర రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మర్కుక్ మండలం ఎర్రబెల్లి వ్యవసాయ క్షేత్రంలో మాజీ సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం స్థానిక ఎన్నికలు పార్టీ వ్యవహారాల గురించి చర్చించారు.

December 27, 2024 / 09:34 AM IST

‘భారతరత్న’కు అర్హుడు మన్మోహనుడు

మాజీ ప్రధాని మన్మోహన్ నిన్న రాత్రి మరణించిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల దేశవ్యాప్తంగా ప్రజలు, ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. అయితే మన్మోహన్ నిజమైన భారత రత్నం అని, ఆయనకు భారత అత్యున్నత పురస్కారం ఇవ్వాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. కాగా, రెండుసార్లు ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా మన్మోహన్ ఎంతో సేవ చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు.

December 27, 2024 / 09:34 AM IST

నాంపల్లి ఎగ్జిబిషన్ 2025 విశేషాలు

HYD: జనవరి 1 నుంచి అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (ఎగ్జిబిషన్) 46 రోజులపాటు మహానగర వాసులను అలరించనుంది. ఈ 84వ నుమాయిష్‌లో 2,200 స్టాల్స్ ఏర్పాటు కానున్నాయి. అంతేకాక పలు ప్రభుత్వ శాఖల స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. 160 సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా వేసి నాలుగు ప్రధాన గేట్ల వద్ద మెటల్ డిటెక్టర్లతో క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు.

December 27, 2024 / 09:32 AM IST

కురవిలో ఎస్ఎఫ్ఐ సమావేశాలు ప్రారంభం

మహబూబాబాద్: కురవి మండల కేంద్రంలో నేడు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాలను జాతీయ అధ్యక్షులు విపి సాను ప్రారంభించారు. విద్యార్థుల సమస్యలపై విస్తృతంగా చర్చించారు. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ నాగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు దామేర కిరణ్, రాష్ట్ర సహాయ కార్యదర్శులు ప్రశాంత్, దాసరి ప్రశాంత్, గజ్జెల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

December 27, 2024 / 09:29 AM IST

శ్రీవారి ఆలయంలో పూలంగి సేవకు చురుకుగా ఏర్పాట్లు

VZM: బొబ్బిలి పట్టణంలోని కంచరవీధిలో వేంచేసి ఉన్న శ్రీ భూనీలా సమేత కల్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం పూలంగి సేవ నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రతినిధులు తెలిపారు. పవిత్ర ధనుర్మాసం సందర్బంగా శనివారం వేకువజాము నుంచి స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. అనంతరం స్వామికి పూలంగి సేవ జరిపిస్తామని వెల్లడించారు.

December 27, 2024 / 09:28 AM IST

జిల్లాలో నేటి పత్తి ధరలు

ADB: జిల్లా మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో శుక్రవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,521గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,920గా నిర్ణయించారు. గురువారం ధరతో పోలిస్తే శుక్రవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పులేదు. ప్రైవేట్ పత్తి ధరలో సైతం ఎటువంటి మార్పు లేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.

December 27, 2024 / 09:28 AM IST

పాడి కౌశిక్ రెడ్డిపై కేసు.. పోలీసుల విచారణ  వాయిదా

TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇవాళ్టి విచారణ వాయిదా పడింది. వచ్చే నెల 6న హాజరుకావాలని పోలీసులు తెలిపారు. తన తండ్రికి హార్ట్ ఆపరేషన్ అయ్యిందని అందుకే విచారణకు హాజరుకాలేకపోతున్నట్లు కౌశిక్ రెడ్డి పోలీసులకు చెప్పారు. 10 రోజుల గడువు కోరారు. కాగా, ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్ వెళ్లిన MLA.. సీఐతో దురుసుగా ప్రవర్తించినందుకు ఆయనపై కేసు నమోదైంది.

December 27, 2024 / 09:28 AM IST

నేటి ఆలయ కమిటీల ప్రమాణస్వీకారం వాయిదా

KMR: బిక్కనూర్ మండలం తిప్పాపూర్ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం, కాచాపూర్ గ్రామంలోని విశ్వేశ్వర ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం వాయిదా వేసినట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భీమ్ రెడ్డి తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అకాల మరణం పట్ల ప్రభుత్వం వారం రోజులు సంతాప దినాలు ప్రకటించినందున, కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

December 27, 2024 / 09:25 AM IST

తెలుగు వికీపీడియా గురించి మీకు తెలుసా..?

HYD: తెలుగు వికీపీడియా పై అందరికీ అవగాహన అవసరమని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ అన్నారు. తెలుగు వికీపీడియాలో లక్ష వ్యాసాలు దాటిన సందర్భంగా హైదరాబాద్ బుక్‌ఫెయిర్ వేదికగా లక్ష వ్యాసాల ప్రస్థానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వికీపీడియా గురించి మీకు తెలుసా..? అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.

December 27, 2024 / 09:23 AM IST

‘ఆర్థిక వ్యవస్థను బలోపేతంలో మన్మోహన్ ది కీలక పాత్ర’

KRNL: మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ మృతి పట్ల కర్నూలు మాజీ MLA హఫీజ్ ఖాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించిన మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ గారు పరమపదించడం దేశానికి తీరని లోటు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడుని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని తెలిపారు.

December 27, 2024 / 09:23 AM IST

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

SRPT: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన హుజుర్ నగర్ మండలం గోపాలపురం గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. కీతవారిగూడెం గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ (26) శీలం ఉపేందర్ (24) లు హుజూర్ నగర్ వచ్చి తిరిగి వెళుతుండగా బైక్ అదుపుతప్పి డివైడర్‌ని వారి పల్సర్ బైక్‌తో బలంగా ఢీకొట్టారు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.

December 27, 2024 / 09:23 AM IST

తిరుమల శ్రీవారి దర్శనానికి 20 గంటలు

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి వెలుపల క్యూలైన్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 59,564 మంది భక్తులు దర్శించుకోగా.. 24,905 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. కాగా, హుండీ ఆదాయం రూ.4.18కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. 

December 27, 2024 / 09:22 AM IST

జేఎన్టీయూ యూనివర్సిటీ పరిధిలో పరీక్షలు వాయిదా

HYD: జేఎన్టీయూ యూనివర్సిటీ పరిధిలో నేడు జరగబోయే అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు వెల్లడించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించడంతో నేడు యూనివర్సిటీతో పాటు యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజీలకు కూడా సెలవు ప్రకటించినట్లు ఆయన తెలిపారు. వాయిదా పడిన పరీక్షలకు సంబంధించి తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన అన్నారు.

December 27, 2024 / 09:21 AM IST

ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే

ADB: బాగా చదువుకుని మంచి పేరు తేవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు సూచించారు. దివంగత ఆదివాసి ఉద్యమ నాయకుడు ఉయిక సంజీవ్ కుమార్తె చదువుల కోసం ఆయన ఉట్నూరు పట్టణంలో రూ.50వేల ఆర్థిక సాయం అందించారు. బాగా చదువుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఆయన సూచించారు.

December 27, 2024 / 09:18 AM IST