SRPT: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన హుజుర్ నగర్ మండలం గోపాలపురం గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. కీతవారిగూడెం గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ (26) శీలం ఉపేందర్ (24) లు హుజూర్ నగర్ వచ్చి తిరిగి వెళుతుండగా బైక్ అదుపుతప్పి డివైడర్ని వారి పల్సర్ బైక్‌తో బలంగా ఢీకొట్టారు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.