W.G: భారతదేశ మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కర్త మన్మోహన్ సింగ్ అకాల మృతి పట్ల పాలకొల్లు ఎమ్మెల్యే, రాష్ట్ర జల వందల శాఖామంత్రి నిమ్మల రామానాయుడు గురువారం రాత్రి తీవ్ర సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధించారు. అలాగే మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.
ప్రకాశం: స్కూల్ గేమ్స్ స్టేట్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో ఒంగోలుకు చెందిన శక్తి ధర్మ శ్రీచంద్ర బంగారు పతకం సాధించాడు. ఇటీవల విజయవాడలో జరిగిన అండర్ 17 పోటీలలో 120 కేజీల విభాగంలో అతను పతకం సాధించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అతనిని అభినందించారు.
NDL: శ్రీశైల మల్లన్న దర్శనం అనంతరం మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ భక్తులకు తిరుమలలో ప్రాధాన్యత ఇవ్వాలి అని, భక్తుల విన్నపాలపై ఏపీ ప్రభుత్వం మా విజ్ఞప్తిని పరిష్కరిస్తుందని ఆశిస్తునట్లు పేర్కొన్నారు. TTD తరుపున ధర్మప్రచార నిధులను కేటాయించాలని, గత ప్రభుత్వం పాటించిన విధానాలని ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయాలని కోరుతున్నాం’ అన్నారు.
HYD: నాటి ప్రధాని పీవీ నరసింహరావు కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ దేశంలో ఆర్థిక సంస్కరణలు అమలు చేయడంలో, జీడీపీ వృద్ధి చెందడంలో కీలక పాత్ర పోషించారు. దాదాపు దశాబ్ద కాలం పాటు దేశ ప్రధానిగా సుదీర్ఘ సేవలు అందించి తనదైన ముద్రవేసిన గొప్ప వ్యక్తి, ఆలోచనపరుడని ఎమ్మెల్యే ముఠా గోపాల్ శుక్రవారం తెలిపారు.
కృష్ణా: బందరుకోటలోని మారుతీ ఆలయంలో విగ్రహాలను మతోన్మాదులు ధ్వంసం చేశారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని డీఎస్పీ అబ్దుల్ సుభాన్ ఖండించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, విగ్రహాలను ఎవ్వరూ ధ్వంసం చేయలేదన్నారు. కేవలం విగ్రహాల కోసం ఏర్పాటు చేసిన దిమ్మల నుంచి మాత్రమే విగ్రహాలను తొలగించారన్నారు.
CTR: పుంగనూరు విశ్రాంత ఉద్యోగుల భవనంలో రేపు (శనివారం )ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు మునస్వామి మొదలి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు శిబిరం ప్రారంభమవుతుందని అన్నారు. శంకర్ నేత్రాలయ ఆసుపత్రి నుండి వైద్యులు వచ్చి ఉచితంగా కంటి పరీక్షలు చేసి అవసరమైన వారిని ఆపరేషన్లకు ఎంపిక చేస్తారని తెలిపారు.
మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లా, డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి, మాధవి దంపతుల కుమారుడు ఆదిత్య రెడ్డి, కూతురు సహస్ర రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మర్కుక్ మండలం ఎర్రబెల్లి వ్యవసాయ క్షేత్రంలో మాజీ సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం స్థానిక ఎన్నికలు పార్టీ వ్యవహారాల గురించి చర్చించారు.
మాజీ ప్రధాని మన్మోహన్ నిన్న రాత్రి మరణించిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల దేశవ్యాప్తంగా ప్రజలు, ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. అయితే మన్మోహన్ నిజమైన భారత రత్నం అని, ఆయనకు భారత అత్యున్నత పురస్కారం ఇవ్వాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. కాగా, రెండుసార్లు ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా మన్మోహన్ ఎంతో సేవ చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు.
HYD: జనవరి 1 నుంచి అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (ఎగ్జిబిషన్) 46 రోజులపాటు మహానగర వాసులను అలరించనుంది. ఈ 84వ నుమాయిష్‌లో 2,200 స్టాల్స్ ఏర్పాటు కానున్నాయి. అంతేకాక పలు ప్రభుత్వ శాఖల స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. 160 సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా వేసి నాలుగు ప్రధాన గేట్ల వద్ద మెటల్ డిటెక్టర్లతో క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు.
మహబూబాబాద్: కురవి మండల కేంద్రంలో నేడు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాలను జాతీయ అధ్యక్షులు విపి సాను ప్రారంభించారు. విద్యార్థుల సమస్యలపై విస్తృతంగా చర్చించారు. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ నాగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు దామేర కిరణ్, రాష్ట్ర సహాయ కార్యదర్శులు ప్రశాంత్, దాసరి ప్రశాంత్, గజ్జెల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
VZM: బొబ్బిలి పట్టణంలోని కంచరవీధిలో వేంచేసి ఉన్న శ్రీ భూనీలా సమేత కల్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం పూలంగి సేవ నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రతినిధులు తెలిపారు. పవిత్ర ధనుర్మాసం సందర్బంగా శనివారం వేకువజాము నుంచి స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. అనంతరం స్వామికి పూలంగి సేవ జరిపిస్తామని వెల్లడించారు.
ADB: జిల్లా మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో శుక్రవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,521గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,920గా నిర్ణయించారు. గురువారం ధరతో పోలిస్తే శుక్రవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పులేదు. ప్రైవేట్ పత్తి ధరలో సైతం ఎటువంటి మార్పు లేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.
TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇవాళ్టి విచారణ వాయిదా పడింది. వచ్చే నెల 6న హాజరుకావాలని పోలీసులు తెలిపారు. తన తండ్రికి హార్ట్ ఆపరేషన్ అయ్యిందని అందుకే విచారణకు హాజరుకాలేకపోతున్నట్లు కౌశిక్ రెడ్డి పోలీసులకు చెప్పారు. 10 రోజుల గడువు కోరారు. కాగా, ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్ వెళ్లిన MLA.. సీఐతో దురుసుగా ప్రవర్తించినందుకు ఆయనపై కేసు నమోదైంది.
KMR: బిక్కనూర్ మండలం తిప్పాపూర్ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం, కాచాపూర్ గ్రామంలోని విశ్వేశ్వర ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం వాయిదా వేసినట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భీమ్ రెడ్డి తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అకాల మరణం పట్ల ప్రభుత్వం వారం రోజులు సంతాప దినాలు ప్రకటించినందున, కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
HYD: తెలుగు వికీపీడియా పై అందరికీ అవగాహన అవసరమని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ అన్నారు. తెలుగు వికీపీడియాలో లక్ష వ్యాసాలు దాటిన సందర్భంగా హైదరాబాద్ బుక్‌ఫెయిర్ వేదికగా లక్ష వ్యాసాల ప్రస్థానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వికీపీడియా గురించి మీకు తెలుసా..? అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.