• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘ఆర్థిక వ్యవస్థను బలోపేతంలో మన్మోహన్ ది కీలక పాత్ర’

KRNL: మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ మృతి పట్ల కర్నూలు మాజీ MLA హఫీజ్ ఖాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించిన మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ గారు పరమపదించడం దేశానికి తీరని లోటు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడుని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని తెలిపారు.

December 27, 2024 / 09:23 AM IST

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

SRPT: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన హుజుర్ నగర్ మండలం గోపాలపురం గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. కీతవారిగూడెం గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ (26) శీలం ఉపేందర్ (24) లు హుజూర్ నగర్ వచ్చి తిరిగి వెళుతుండగా బైక్ అదుపుతప్పి డివైడర్‌ని వారి పల్సర్ బైక్‌తో బలంగా ఢీకొట్టారు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.

December 27, 2024 / 09:23 AM IST

తిరుమల శ్రీవారి దర్శనానికి 20 గంటలు

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి వెలుపల క్యూలైన్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 59,564 మంది భక్తులు దర్శించుకోగా.. 24,905 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. కాగా, హుండీ ఆదాయం రూ.4.18కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. 

December 27, 2024 / 09:22 AM IST

జేఎన్టీయూ యూనివర్సిటీ పరిధిలో పరీక్షలు వాయిదా

HYD: జేఎన్టీయూ యూనివర్సిటీ పరిధిలో నేడు జరగబోయే అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు వెల్లడించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించడంతో నేడు యూనివర్సిటీతో పాటు యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజీలకు కూడా సెలవు ప్రకటించినట్లు ఆయన తెలిపారు. వాయిదా పడిన పరీక్షలకు సంబంధించి తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన అన్నారు.

December 27, 2024 / 09:21 AM IST

ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే

ADB: బాగా చదువుకుని మంచి పేరు తేవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు సూచించారు. దివంగత ఆదివాసి ఉద్యమ నాయకుడు ఉయిక సంజీవ్ కుమార్తె చదువుల కోసం ఆయన ఉట్నూరు పట్టణంలో రూ.50వేల ఆర్థిక సాయం అందించారు. బాగా చదువుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఆయన సూచించారు.

December 27, 2024 / 09:18 AM IST

మన్మోహన్ సింగ్ మరణం తీరనిలోటు: కేంద్రమంత్రి

SKLM: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం తీరనిలోటు అని శ్రీకాకులం కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. గురువారం రాత్రి ఆయన సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ చరిత్రలో నిలిచిపోయారన్నారు. ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

December 27, 2024 / 09:16 AM IST

మతాంతర వివాహాలు చేసుకున్న మన్మోహన్ కుమార్తెలు

మాజీ ప్రధాని మన్మోహన్ 1958లో గురుశరణ్ కౌర్ కోహ్లిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఉపిందర్, దామన్ సహా అమృత్ అనే ముగ్గురు కుమార్తెలు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఎక్కువ కాలం ఉన్నపటికీ.. కుటుంబం ఎక్కువగా వెలుగులోకి రాలేదు. వారందరూ మతాంతర వివాహాలు చేసుకోవడం విశేషం. వారంతా రాజకీయాలకు దూరంగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు. దామన్ రచయిత్రిగా ప్రఖ్యాతి చెందారు.

December 27, 2024 / 09:15 AM IST

దేశం గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయింది: ఎమ్మెల్యే

MBNR: దేశం గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయిందని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి శుక్రవారం పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఆర్బీఐ గవర్నర్‌గా, పీవీ నరసింహారావు క్యాబినెట్‌లో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచీకరణ, సరళీకరణ, ఆర్థిక విధానం ప్రవేశపెట్టి దేశ అభివృద్ధికి బాటలు వేశారని గుర్తు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టిష్ట పునాది వేశారన్నారు.

December 27, 2024 / 09:13 AM IST

బొగ్గు ఉత్పత్తిలో రక్షణకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి

BDK: బొగ్గు ఉత్పత్తిలో రక్షణకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర రెడ్డి సూచించారు. మణుగూరు ఏరియాలో పర్యటించిన డైరెక్టర్ ఓసీ 2, ఓసీ 4 గనులను సందర్శించారు. గనుల్లో జరుగుతున్న బొగ్గు ఉత్పత్తి, లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. మణుగూరు ఏరియాలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని బొగ్గు ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందించాలన్నారు.

December 27, 2024 / 09:11 AM IST

ఏబీవీపీ రాష్ట్ర కార్య సమితి సభ్యుడిగా అర్జున్

WNP: సిద్దిపేట్ జిల్లాలో జరిగిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 43వ రాష్ట్ర మహాసభలలో రాష్ట్ర కార్య సమితి సభ్యుడిగా ఏబీవీపీ వనపర్తి జిల్లా కన్వీనర్ అర్జున్ సాతర్ల నియమితులయ్యారు. ఆయన మాట్లాడుతూ.. తమపై నమ్మకం ఉంచి రాష్ట్ర కార్య సమితి సభ్యుడిగా నియమించినందుకు అర్జున్ సాతర్ల రాష్ట్ర శాఖకు ధన్యవాదాలు తెలిపారు.

December 27, 2024 / 09:10 AM IST

రక్తదానం చేయడం అభినందనీయం: జీఎం

MNCL: సింగరేణియులు బొగ్గు ఉత్పత్తి చేయడమే కాకుండా రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవడం అభినందనీయమని మందమర్రి జీఎం దేవేందర్ కొనియాడారు. ఏరియాలోని వృత్తి శిక్షణ కేంద్రంలో సింగరేణి, రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని జీఎం ప్రారంభించారు.

December 27, 2024 / 09:10 AM IST

క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుడి అరెస్టు

WGL: ఖిలా వరంగల్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఒకరిని వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేసి మిల్స్ కాలనీ పోలీసులకు అప్పగించారు. పడమర కోటకు చెందిన తాడెం భరత్ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. సీఐ రంజిత్ ఎస్సై దిలీప్ పోలీసు బృందంతో కలిసి తనిఖీలు చేశారు. రెండు మొబైళ్లు, రూ. 2,46,700 స్వాధీనం చేసుకొని విచారిస్తున్నారు.

December 27, 2024 / 09:10 AM IST

బూత్ కమిటీలను బలోపేతం చేయాలి

ప్రకాశం: గిద్దలూరు నియోజకవర్గ బీజేపీ బూత్ కమిటీలను బలోపేతం చేయాలని ఎన్నికల రిటర్నింగ్, రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు షేక్ బాజీ చెప్పారు. గిద్దలూరు అసెంబ్లీ బూత్ కమిటీల సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్చార్జి రవి శంకర్, ప్రధాన కార్యదర్శి నరాల శ్రీనివాస రెడ్డి మాట్లాడారు. బాజీ మాట్లాడుతూ.. ప్రతి మండల అధ్యక్షులు బూత్ కమిటీల నియామకం త్వరగా పూర్తి చేయాలన్నారు.

December 27, 2024 / 09:10 AM IST

జిల్లా ప్రజలను వణికిస్తున్న చలిగాలులు

WNP: జిల్లా ప్రజలను గత మూడు రోజుల నుంచి చలిగాలులు వణికిస్తున్నాయి. తెల్లవారుజాము నుంచే చలి తీవ్రత పెరిగిందని, పనులపై బయటకు వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారు. దీనికి తోడుగా వణికిస్తున్న చలిగాలికి తోడు ముసురు వర్షం పడుతుందని అన్నారు. వృద్ధులు, ఆస్తమా రోగులు ఇబ్బంది పడుతున్నారని, కాగా చలిగాలి తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

December 27, 2024 / 09:09 AM IST

దేశంలో రుణమాఫీ ఘనత మన్మోహన్ సింగ్ దే: ఎమ్మెల్యే

MBNR: దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ చేసిన ఘనత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దేనని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. దేశం గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయిందని, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు.1991లో ఆర్థిక విధానం ప్రవేశపెట్టి భారతదేశాన్ని అభివృద్ధి వైపు అడుగులు వేశారని ఎమ్మెల్యేలు నేడు అన్నారు.

December 27, 2024 / 09:07 AM IST