• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మలేషియాలో తెలుగు కోర్సులు: నిత్యానందరావు

HYD: నాంపల్లిలో మలేషియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో తెలుగు భాషలో డిప్లొమా కోర్సుల నిర్వహణకు ఒప్పందం కుదుర్చుకున్నామని పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వైస్ ఛైర్మన్ నిత్యానందరావు తెలిపారు. తెలుగు భాష ఉనికి పోతే తెలుగు జాతి ఆస్తిత్వం కోల్పోతుందన్నారు. ఇది మలేషియాలో స్థిరపడ్డ తెలుగు జాతికి ఎంతో ఉపయోగమన్నారు.

December 27, 2024 / 08:47 AM IST

నీటిలో యువకుడి మృత దేహం

WGL: తొర్రూర్ మండలం అమ్మాపురం గ్రామ శివారులో నీటితో నిండుకున్న క్వారీ గుంతలో జారిపడిన కడెం హరీశ్ (17) మృతదేహం ఉదయం నీటిపై తేలింది. కాగా, నిన్న సాయంత్రం ఫైర్ సిబ్బంది, స్థానికులు బాధితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. మృతుడి, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

December 27, 2024 / 08:47 AM IST

జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి: ఎమ్మెల్యే యెన్నం

MBNR: జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కొత్తగా ఎన్నికైన తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం సభ్యులు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అందరం కలిసికట్టుగా కృషి చేసి రాష్ట్రంలోనే జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలపాలని పిలుపునిచ్చారు.

December 27, 2024 / 08:47 AM IST

దర్శకుడు సభాపతి కన్నుమూత

టాలీవుడ్‌ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా తమిళ దర్శకుడు సభాపతి దక్షిణామూర్తి అనారోగ్యంతో కన్నుమూశారు. 61 ఏళ్ల వయసున్న ఆయన ఆసుపత్రిలో మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన తమిళంలో విజయ్ కాంత్ హీరోగా ‘భారతన్’ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తర్వాత ప్రభుదేవాతో ‘వీఐపీ’, జగపతి బాబుతో ‘పందెం’ సహా పలు సినిమాలను తెరకెక్కించారు.

December 27, 2024 / 08:46 AM IST

పెనుగొండ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు

శ్రీ సత్యసాయి: పెనుగొండ పట్టణ కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెనుగొండ బాబా ఫక్రుద్దీన్ దర్గాలో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తాదులు పెద్ద ఎత్తున పాల్గొని దర్గాలో బాబా ఫక్రుద్దీన్ స్వామిని దర్శించుకుని ప్రత్యేక చక్కెర చదివింపులు చేసి తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు.

December 27, 2024 / 08:44 AM IST

ఫుట్ బాల్ టీంను సన్మానించిన ఎమ్మెల్యే

NRML:  భైంసాకు చెందిన ఫ్రెండ్స్ ఫుట్ బాల్ క్లబ్ టీమ్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్ సన్మానించి అభినందించారు. ఈనెల 19న ప్రభుత్వం నిర్వహించిన సీఎం కప్ పోటిలో జిల్లా స్థాయి విజేతగా ఎంపికై కలెక్టర్ చేతుల మీదుగా కప్‌ను అందుకున్నారు. స్టేట్ లెవెల్ ఎంపిక కావడం అభినందనీయమని అన్నారు.

December 27, 2024 / 08:43 AM IST

‘అర్జీలకు 45 రోజుల్లో పరిష్కారం చూపుతాం’

KRNL: ఆలూరు మండలంలోని కమ్మరచేడులో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో వినతులు వెల్లువెత్తాయి. గ్రామ పరిధిలో 98 మంది భూ సమస్యలు పరిష్కారం కోసం అర్జీలు అందించినట్లు తహసీల్దార్ గోవింద్ సింగ్ తెలిపారు. ఇందులో 54 మంది రైతుల భూములను అడంగల్‌లో ఇనాం భూములుగా చూపిస్తున్నాయని వాటిని మార్చాలని అర్జీలు అందించారన్నారు. విస్తీర్ణంలో తేడాలు సరిచేయాలని 44 అర్జీల్లో కోరారు.

December 27, 2024 / 08:42 AM IST

గుండెపోటుతో టీడీపీ సీనియర్ నేత మృతి

BPT: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కామేపల్లి కృషి బాబు మృతి చెందాడు. బాపట్ల మండలం నరసాయపాలెం గ్రామానికి చెందిన ప్రముఖ హైకోర్టు న్యాయవాది, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కామేపల్లి కృషి బాబు(65) శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

December 27, 2024 / 08:42 AM IST

విస్సన్నపేటలో బెల్లపు ఊట ధ్వంసం.. మహిళ అరెస్ట్

కృష్ణా: విస్సన్నపేట మండలంలోని చండ్రు పట్ల తండాలో గురువారం సారా స్థావరంపై ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. సారా కాస్తున్న మహిళ బాణావతు పింప్లిని అరెస్ట్ చేసి ఆమె వద్దనున్న 1 లీటర్ల సారా, 40 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. మహిళను తిరువూరు కోర్ట్ ఎదుట హాజరు పరచినట్లు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ పేర్కొన్నారు.

December 27, 2024 / 08:41 AM IST

ఈ నెల 30న కొమరోలు మండల సర్వసభ్య సమావేశం

ప్రకాశం: కొమరోలు మండల సర్వసభ్య సమావేశం ఈనెల 30వ తేదీ ఉదయం 10:30 గంటలకు మండల పరిషత్ అధ్యక్షురాలు కామూరి అమూల్య అధ్యక్షతన నిర్వహించనున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి మస్తాన్ వలి తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గిద్దలూరు ఎమ్మెల్యే ఆశోక్ రెడ్డి హాజరవుతారని, అన్ని శాఖల అధికారులు వారి శాఖలకు సంబంధించిన సమగ్ర నివేదికలతో సమావేశానికి హాజరుకావాలని ఆయన కోరారు.

December 27, 2024 / 08:40 AM IST

వాల్తేరు డి.ఆర్. ఎం గా లలిత్ బోహ్ర

VSP: వాల్తేరు డివిజన్ రైల్వే మేనేజర్‌గా లలిత్ బోహ్ర నియమితులయ్యారు. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ రైల్వే నుండి గురువారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇంతక ముందు ఇక్కడ డీఆర్ఎంగా వ్యవహరించిన సౌరబ్ ప్రసాద్ ముంబాయి సీబీఐ లంచం కేసులో పట్టబడిన విషయం పాఠకులకు విదితమే.. త్వరలోనే కొత్త బాధ్యతలు చేపడతారని రైల్వే వర్గాలు తెలిపారు.

December 27, 2024 / 08:40 AM IST

గుడివాడలో బాలికకు వేధింపులు

కృష్ణా: గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హైస్కూల్ వద్ద 10వ తరగతి చదువుతున్న బాలికను యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈక్రమంలో అక్కడే విధుల్లో ఉన్న శక్తి టీమ్ సభ్యురాలు స్వర్ణలత వెంటనే స్పందించి అతడ్ని గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. సీఐ సీహెచ్. నాగ ప్రసాద్ ఆధ్వర్యంలో బాలిక, యువకుడి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు.

December 27, 2024 / 08:37 AM IST

వన్యప్రాణుల రక్షణ అందరి బాధ్యత: ఎఫ్ఆర్ఓ

ASF: అడవులు, వన్యప్రాణుల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎఫ్ఆర్ఓ మజారుద్దీన్ తెలిపారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో అడవులను సందర్శించారు. ఆయన అడవికి సమీపంలో ఉన్న రైతులు తమ పంట వ్యర్థాలను నిప్పులు పెట్టవద్దని సూచించారు. అడవులను ధ్వంసం చేసినా, వన్యప్రాణులకు హాని కలిగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

December 27, 2024 / 08:36 AM IST

‘ఆయన హయాంలో పని చేయటం నా అదృష్టం’

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతిపై మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు. మన్మోహన్ మరణం దేశానికి తీరని లోటని అన్నారు. ఆయన హయాంలో పార్లమెంట్‌ సభ్యుడిగా పనిచేయడం తన అదృష్టమని పేర్కొన్నారు. మన్మోహన్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

December 27, 2024 / 08:35 AM IST

అయిజ పెద్ద వాగు బ్రిడ్జ్ ప్రమాదం.. వ్యక్తి మృతి

GDWL: అయిజ మున్సిపల్ కేంద్రంలో అసంపూర్ణంగా నిర్మించిన పెద్ద వాగు బ్రిడ్జ్‌పై గురువారం డేవిడ్ అనే యువకుడు ప్రమాదానికి గురై కర్నూల్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారు జామున మరణించాడు. బ్రిడ్జ్ స్లాబ్ రోడ్డు కంటే ఎత్తుగా ఉండటంతో వాహనదారులు గమనించకుండా ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికే బ్రిడ్జిపై మూడు ప్రాణాలు కోల్పోవడం జరిగింది.

December 27, 2024 / 08:34 AM IST