టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెత్త ఫామ్ కొనసాగుతోంది. గత రెండు టెస్టుల్లో మిడిలార్డర్‌లో బరిలోకి దిగి విఫలమవడంతో బాక్సింగ్ డే టెస్టులో ఓపెనర్‌గా దిగాడు. అయితే కమిన్స్ వేసిన తొలి ఓవర్‌లోనే చెత్త షాట్ ఆడి ఔట్ అయ్యాడు. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలంటే ఈ మ్యాచ్ కీలకంగా మారగా.. రోహిత్ ఫెయిల్ కావడంపై ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
SKLM: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం బాధాకరమని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం రాత్రి మన్మోహన్ సింగ్ మరణించడంతో ఆయనతో కలిసి ఉన్న ఫోటోలను అచ్చెన్న సోషల్ మీడియాలో పంచుకున్నారు. దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఆయనతో అనుబంధం మరువలేనిదని పేర్కొన్నారు.
KNR: శాతవాహన యూనివర్సిటీ పరిధిలో సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే నేడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాప సూచకంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించగా నేటి మొదటి సెమిస్టరు పరీక్షను వాయిదా వేసినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. రేపటి నుంచి జరగాల్సిన యూనివర్సిటీ పరీక్షలు యథావిధిగా జరుగుతాయాన్నారు.
శబరిమల అయ్యప్ప ఆలయం మూసివేశారు. మండల పూజలు ముగియటంతో దర్శనాలు నిలిపివేసినట్లు ఆలయాధికారులు తెలిపారు. ఇప్పటివరకు 32.50 లక్షల మంది అయ్యప్ప స్వామివారిని దర్శించుకున్నట్లు చెప్పారు. ఈ నెల 30న ఆలయం మళ్లీ తెరుచుకోనున్నట్లు వెల్లడించారు. కాగా.. శబరిమల కొండపై జనవరి 14న మకరజ్యోతి దర్శనం ఉంటుంది.
నెల్లూరులోని స్టేడియం వద్ద ఉన్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో అక్రమంగా తరలిస్తున్న గంజాయి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు విజయవాడ నుంచి తిరుపతి వైపు వెళ్తున్న బస్సు నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి తనిఖీలు చేపట్టుగా 12 కిలోల గంజాయి పట్టుబడిందని వెల్లడించారు. వివరాల ప్రకారం ఆరు ప్యాకెట్లలో ప్యాక్ చేశారని సదరు వ్యక్తిని అరెస్టు చేసామన్నారు.
VSP: పట్టణ అధికార భాష అమలు కమిటీ (టోలిక్) రాజభాష అమలు చేయడానికి చేస్తున్న కృషి ప్రశంసనీయమని స్టీల్ ప్లాంట్ ఇన్ఛార్జి సీఎండీ ఏకె సక్సేనా అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో గురువారం టోలిక్ 16వ సమావేశాన్ని వర్చువల్ పద్ధతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ-ప్రస్తుతి కిరణ్‌ను విడుదల చేశారు.
KDP: 4 రోజుల పర్యటనలో భాగంగా YS జగన్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆయన నిన్న పులివెందులలోని తన నివాసంలో ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజా దర్బార్ నిర్వహించారు. నేటి ఉదయం ఓ వివాహంలో సతీసమేతంగా వైయస్ జగన్ పాల్గొని, అనంతరం పులివెందుల నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి తాడేపల్లికి వెళ్తారు.
WGL: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు నేడు జరగబోయే ఐదవ, మొదటి సెమిస్టర్‌కు సంబంధించిన పరీక్షలు వాయిదా వేసినట్లు రిజిస్ట్రార్ మల్లారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. వాయిదా పడిన పరీక్షలు ఈనెల (డిసెంబర్) 31న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తదుపరి పరీక్షలు యథావిధిగా షెడ్యూల్ ప్రకారం ఉంటాయని అన్నారు.
HYD: నాంపల్లిలో మలేషియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో తెలుగు భాషలో డిప్లొమా కోర్సుల నిర్వహణకు ఒప్పందం కుదుర్చుకున్నామని పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వైస్ ఛైర్మన్ నిత్యానందరావు తెలిపారు. తెలుగు భాష ఉనికి పోతే తెలుగు జాతి ఆస్తిత్వం కోల్పోతుందన్నారు. ఇది మలేషియాలో స్థిరపడ్డ తెలుగు జాతికి ఎంతో ఉపయోగమన్నారు.
WGL: తొర్రూర్ మండలం అమ్మాపురం గ్రామ శివారులో నీటితో నిండుకున్న క్వారీ గుంతలో జారిపడిన కడెం హరీశ్ (17) మృతదేహం ఉదయం నీటిపై తేలింది. కాగా, నిన్న సాయంత్రం ఫైర్ సిబ్బంది, స్థానికులు బాధితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. మృతుడి, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
MBNR: జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కొత్తగా ఎన్నికైన తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం సభ్యులు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అందరం కలిసికట్టుగా కృషి చేసి రాష్ట్రంలోనే జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలపాలని పిలుపునిచ్చారు.
టాలీవుడ్‌ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా తమిళ దర్శకుడు సభాపతి దక్షిణామూర్తి అనారోగ్యంతో కన్నుమూశారు. 61 ఏళ్ల వయసున్న ఆయన ఆసుపత్రిలో మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన తమిళంలో విజయ్ కాంత్ హీరోగా ‘భారతన్’ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తర్వాత ప్రభుదేవాతో ‘వీఐపీ’, జగపతి బాబుతో ‘పందెం’ సహా పలు సినిమాలను తెరకెక్కించారు.
శ్రీ సత్యసాయి: పెనుగొండ పట్టణ కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెనుగొండ బాబా ఫక్రుద్దీన్ దర్గాలో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తాదులు పెద్ద ఎత్తున పాల్గొని దర్గాలో బాబా ఫక్రుద్దీన్ స్వామిని దర్శించుకుని ప్రత్యేక చక్కెర చదివింపులు చేసి తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు.
NRML: భైంసాకు చెందిన ఫ్రెండ్స్ ఫుట్ బాల్ క్లబ్ టీమ్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్ సన్మానించి అభినందించారు. ఈనెల 19న ప్రభుత్వం నిర్వహించిన సీఎం కప్ పోటిలో జిల్లా స్థాయి విజేతగా ఎంపికై కలెక్టర్ చేతుల మీదుగా కప్‌ను అందుకున్నారు. స్టేట్ లెవెల్ ఎంపిక కావడం అభినందనీయమని అన్నారు.
KRNL: ఆలూరు మండలంలోని కమ్మరచేడులో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో వినతులు వెల్లువెత్తాయి. గ్రామ పరిధిలో 98 మంది భూ సమస్యలు పరిష్కారం కోసం అర్జీలు అందించినట్లు తహసీల్దార్ గోవింద్ సింగ్ తెలిపారు. ఇందులో 54 మంది రైతుల భూములను అడంగల్‌లో ఇనాం భూములుగా చూపిస్తున్నాయని వాటిని మార్చాలని అర్జీలు అందించారన్నారు. విస్తీర్ణంలో తేడాలు సరిచేయాలని 44 అర్జీల్లో కోరారు.