VZM: దీపం-2 పథకంలో భాగంగా పూసపాటిరేగ మండల కేంద్రంలో మహిళలకు శనివారం ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ జరగనున్నదని ఎమ్మెల్యే లోకం నాగ మాధవి తెలిపారు. సాయంత్రం నాలుగు గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని, ఈ కార్యక్రమానికి మార్క్ ఫెడ్ ఛైర్మన్ కర్రోతు బంగారు రాజు, ఎంపీ అప్పలనాయుడు హాజరు కానున్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
TG: HYD నిమ్స్‌లో చిన్నపిల్లలకు ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీలు నిర్వహించనున్నారు. ఈనెల 9 వరకు స్ర్కీనింగ్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. నిమ్స్‌లోని ప్లాస్టిక్ అండ్ రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ విభాగం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. మొదటి రోజు ఈ శిబిరంలో బాలల దినోత్సవం సందర్భంగా ఎంపిక చేసిన పిల్లలకు శస్త్రచికిత్సలు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట...
NGL: జిల్లాకు చెందిన అండర్ 17,19 విభాగం షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు గోల్డ్ మెడల్ సాధించి, మధ్యప్రదేశ్‌లో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపిక అయ్యారని, AGF సెక్రటరీ దగ్గుపాటి విమల తెలిపారు. సరూర్ నగర్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలలో ఈవిజయం సాధించారని చెప్పారు. గోల్డ్ మెడల్ సాధించిన అన్విత్ నిహాల్ రెడ్డి, శశాంక్, అఖిలేష్ గౌడ్, లాస్యలను కలెక్టర్ అభినందించారు.
PLD: రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దీపం పథకం-2ను గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, పల్నాడు కలెక్టర్ అరుణ్ బాబు పిడుగురాళ్లలో శుక్రవారం ప్రారంభించారు. ముందుగా పట్నంలోని 4వ వార్డులో ఎమ్మెల్యే, కలెక్టర్ లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, జనసేన నేత కటకం అంకారావు పాల్గొన్నారు.
NRML: వాంకిడిలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల విద్యార్థులు మధ్యాహ్న భోజనం వికటించి అనారోగ్యం పాలయ్యారు. కాగా దీనికి కారకులైన పాఠశాల ప్రిన్సిపల్, వార్డెన్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆదివాసీ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. చికిత్స పొందుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. భరత్, తుకారాం, తదితరులు ఉన్నారు.
NZB: జక్రాన్ పల్లి మండలం అర్గుల్లో నూతనంగా ఎన్నికైన గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుక్రవారం సన్మానించారు. అనంతరం గ్రామంలో ఉన్న రోడ్డు సమస్యలను ఆయనకు వివరించారు. గ్రామ అభివృద్ధి నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు.
నంద్యాల: ప్యాపిలి మండలం బోయవాండ్లపల్లి సమీపంలోని బోయ గుహలలో నేడు నిర్వహించే మహర్షి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నంద్యాల ఎంవీఆర్పీఎస్ నాయకులు కోరారు. శనివారం మహర్షి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందని తెలిపారు. శుక్రవారం నంద్యాల వాల్మీకి కార్యాలయంలో ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు.
SKLM: పాలకొండ మాజీ MLA వి.కళావతి వీరఘట్టం వండువ గ్రామంలో శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. విద్య, వైద్య, పోలీస్ శాఖ వ్యవస్థలను NDA ప్రభుత్వం పూర్తిగా నాశనం చేసిందని కళావతి విమర్శించారు. అధికార పార్టీ నాయకులు అక్రమ ఇసుక రవాణా చేస్తూ ప్రజల సొమ్మును కొల్లగొడుతున్నారని ఆమె మండిపడ్డారు. గత ప్రభుత్వంలో మంజూరైన రహదారులను నిర్మించాలని డిమాండ్ చేశారు.
NLR: సీఎం నారా చంద్రబాబు నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావూరు రాధాకృష్ణ నాయుడు ఈ మేరకు శుక్రవారం వెంకటాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎంను అభ్యంతరమైన భాషతో మాట్లాడిన కాకాణిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
NLG: ప్రభుత్వం నిర్వహించనున్న సామాజిక, కుల, ఆర్థిక, రాజకీయ సర్వేను పారదర్శకంగా చేపట్టాలని అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ సూచించారు. శుక్రవారం నీలగిరి మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మున్సిపల్ ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఇంటిలో నివాసం ఉంటున్న కుటుంబ సభ్యుల అందరి వివరాలు సమగ్రంగా సేకరించాలని కోరారు.
HYD: రైలు ఢీకొని కూలీ మృతి చెందిన ఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే ఇన్స్పెక్టర్ ఆర్. ఎల్లప్ప తెలిపిన వివరాల ప్రకారం.. ఓయూ మాణికేశ్వరినగర్‌కు చెందిన సురేశ్ (45) కూలి పనిచేస్తుంటాడు. ఆర్ట్స్ కాలేజీ రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.
కృష్ణా: ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవన వృద్ధికి రూపొందించిన అద్భుత పథకాల సమూహమే సూపర్ 6 అని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా తెలిపారు. ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం NDA ప్రభుత్వం ‘సూపర్ 6’ లో మొదటిదైన గ్యాస్ సిలిండర్ల హామీని నెరవేర్చిందని సుజనా పేర్కొన్నారు. ఇవాళ సీఎం చంద్రబాబు 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు.
కృష్ణా: ముదినేపల్లి మండలం గురజలో టీడీపీ నాయకుడు రామకృష్ణ ఏర్పాటు చేసిన సాయి వాటర్ ప్లాంట్‌ను శుక్రవారం ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. 99 శాతం వ్యాధులు నీటి ద్వారానే సంక్రమిస్తాయని, అందుకే అందరూ స్వచ్ఛమైన నీళ్లు తాగాలని ఆయన సూచించారు.
KRNL: కార్తీక మాసం సందర్భంగా తెల్లవారుజాము నుంచే శైవ ఆలయాలకు, నదీ తీర ప్రాంతాలు, వంకలు, చెరువులలో పుణ్య స్నానాలు ఆచరించడానికి వెళ్లే భక్తులకు జిల్లా ఎస్పీ కీలక సూచనలు చేశారు. తమ వెంట చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలను తీసుకొని వెళ్తే.. వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. కర్నూలులో కార్తీక దీపాలు వదిలే వినాయక్ ఘాట్ తదితర చోట్ల భక్తుల జాగ్రత్తగా ఉండాలన్నారు.
ELR: ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నవంబర్ 6లోపు ఫారం – 18ని పూర్తి చేసి తాహశీల్దార్ కార్యాలయంలో అందజేయాలని ఉమ్మడి జిల్లా ఎన్జీఓస్ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఏలూరు ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఎమ్మెల్సీ ఓట్ల నమోదు చేపట్టమన్నారు.