HYD: దుండిగల్ మున్సిపాలిటీ పరిధి 20వ వార్డులోని జెఎన్ఎన్ యుఆర్ఎం లక్ష్మీ నగర్ కాలనీలో కౌన్సిలర్ మురళీ యాదవ్ ఆధ్వర్యంలో సుమారు రూ. 80 లక్షలతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్, మున్సిపల్ చైర్‌పర్సన్ శంబీపూర్ కృష్ణవేణి క్రిష్ణ కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు.
VSP: దేవరాపల్లి మండలం శ్రీరాంపురం జంక్షన్ వద్ద ముందస్తు సమాచారం మేరకు పోలీసులు వాహనాలను తనిఖీ చేసి మూడు కేజీల గంజాయిని పట్టుకున్నారు. స్థానిక ఎస్ఐ టీ.మల్లేశ్వరరావు మంగళవారం తెలిపిన వివరాలు ప్రకారం. విశాఖపట్నానికి చెందిన టీ.శశికుమార్, వి.తనూజ్ స్కూటీపై మూడు కేజీల గంజాయి తరలిస్తుండగా గంజాయిని సీజ్ చేసి, వారిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.
VSP: గాజువాక నియోజకవర్గంలోని ఎన్ఏడి వంతెనపై బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. లారీని ఓవర్ టేక్ చేయబోయిన ద్విచక్ర వాహనదారుడు కిందపడిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయని, అతన్ని మెరుగైన వైద్యం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. మృతదేహాన్ని కేజీహెచ్ హాస్పిటల్‌కి పంపించారు.
ATP: రూరల్ స్థానిక కక్కలపల్లి మార్కెట్‌లో కిలో టమాటా గరిష్ఠంగా రూ.28లకు అమ్ముడు పోయినట్లు రాప్తాడు మార్కెట్ యార్డు కార్యదర్శి రాంప్రసాద్ తెలిపారు. మార్కెట్‌కు మంగళవారం మొత్తంగా 975 టన్నుల దిగుబడులు వచ్చాయని ఆయన అన్నారు. కిలో సరాసరి రూ.20లు, కనిష్ఠ ధర రూ.13లు పలికినట్లు తెలిపారు. మార్కెట్లో టమాటా ధరలు తగ్గుతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
NTR: ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసింది. కృష్ణా జిల్లాలో మొత్తం 15,38,937 మంది ఓటర్లు ఉన్నారు. గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి 2,79,307 మంది ఓటర్లుగా నమోదయ్యారు. వీరిలో పురుషులు 1,34,354, మహిళలు 1,44,941, థర్డ్ జెండర్ 12 మంది ఉన్నారు. వీరితో పాటు 70 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నట్లు జాబితాలో ఎన్నికల సంఘం పేర్కొంది.
NZB: బీసీ కమిషన్ సభ్యుల బృందం సోమవారం రాత్రి నిజామాబాద్ నగరంలోని బురుడు గల్లీ ప్రాంతాన్ని సందర్శించారు. స్థానికంగా దశాబ్దాల కాలం నుంచి నివాసాలు ఉంటున్న మేదరి కులస్తుల జీవన స్థితిగతులను క్షేత్రస్థాయి సందర్శన ద్వారా ప్రత్యక్షంగా పరిశీలించారు. కమిషన్ ఛైర్మన్ నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాశ్, సురేందర్, బాలలక్ష్మీలు మేదరి కులస్థులకు చెందిన ఒక్కో ఇంటిని సందర్శించారు.
VSP: దేశమంతా జరుపుకునే పండుగలలో దీపావళి ఎంతో ప్రత్యేకమైనదని, చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటారని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. సంప్రదాయ అలంకరణ వంటకాలతో యువతీ, యువకులు ఆనందోత్సాహాలతో వేడుకలో పాల్గొన్నారు. వళి అంటే వరుస, దీపావళి అంటే దీపాల వరుస అని చీకట్లను పారద్రోలే ఉత్సవాన్ని కాలుష్య రహితంగా చేసుకోవాలని సూచించారు.
VSP: రెవెన్యూ సేవలను మరింత విస్తృతం చేయాలని, అధికారులు, సిబ్బంది ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. రామాటాకీస్ జంక్షన్ వద్ద గల అంబేద్కర్ భవన్ లో మంగళవారం జరిగిన విశాఖ డివిజన్ రెవెన్యూ కాన్ఫరెన్స్ లో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పని చేయాలని, ప్రజలకు సత్వరమే సేవ అందించాలని సూచించారు.
BDK: జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మాట్లాడారు. కుటుంబ సర్వేలో సామాజిక ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులం వంటి అంశాలపై ఇంటింటికి తిరుగుతూ విధివిధానాలు తెలుసుకోవాలని కోరారు.
NLG: ఉమ్మడి జిల్లాలో 29,64,914 మంది ఓటర్లు ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన తుది ముసాయిదా ఓటర్ జాబితాను మంగళవారం పోలింగ్ కేంద్రాల్లో ప్రకటించారు. నల్గొండలో 15,02,203, సూర్యాపేటలో 10,04,284, యాదాద్రి భువనగిరిలో 4,58,426 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. వారిలో 14,58,709 మంది పురుషులు, 15,06,000 మంది మహిళలు, 204 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు.
NLG: దేవరకొండ ఆర్టీసీ డిపో నుండి నడుస్తున్న డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు బహుమతులు ఇవ్వనున్నట్లు డీఎం రమేష్ బాబు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. డిపో నుంచి హైదరాబాద్, సాగర్ మాచర్ల రూట్లలో నడుస్తున్న డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే మహిళలు టికెట్ వెనక పేరు ఫోన్ నెంబర్ రాసి బస్సులో ఏర్పాటు చేసిన గిఫ్ట్ బాక్స్‌లో వేయాలని 15 రోజులకు ఒకసారి లక్కీడ్రా ద్వారా విజేతలను ఎంపిక చేస్తామన్నారు.
VSP: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంజీ ట్రోఫీలో హిమాచల్ ప్రదేశ్ జట్టు 38పరుగుల తేడాతో విజయం సాధించింది. పీఎం పాలెంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో మంగళవారం జరిగిన ఎలైట్ గ్రూపు బీలో హిమాచల్ ప్రదేశ్ బౌలర్ల ధాటికి ఆంధ్ర జట్టు రెండో ఇన్నింగ్స్ తక్కువ స్కోర్కు ఆలౌట్ అయ్యింది. ఇదిలా ఉండగా ఆల్రౌండ్ ప్రతిభ చూపిన రిషిధావన్ ప్లేయర్ఆఫ్ ది మ్యాచ్.
GNTR: ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసింది. జిల్లాలో మొత్తం 17,95,789మంది ఓటర్లు ఉన్నారు. మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి 2,93,222మంది ఓటర్లుగా నయోదయ్యారు. వీరిలో పురుషులు 1,41,025మంది మహిళలు 1,51,052మంది థర్డ్ జెండర్ 12మంది ఉన్నారు. వీరితో పాటు 133మంది సర్వీస్ ఓటర్లు ఉన్నట్లు జాబితాలో ఎలక్షన్ కమిషన్ పేర్కొంది.
విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం జీవీఎంసీ 35వార్డులో ప్రజల సమస్యలపై ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాసరావు బుధవారం పర్యటించారు. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే జీవీఎంసీ చెప్పి పరిష్కరించారు. మరికొన్ని సంబంధిత అధికారులకు తెలియజేసి త్వరలో పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలోని జీవీఎంసీ అధికారులు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
NZB: మాక్లూర్ మండలం మదన్ పల్లి ప్రాథమిక పాఠశాలకు డాక్టర్ భాస్కర్ రెడ్డి, కమల్ రాజు గౌడ్ ఐడీ కార్డులను, బెల్టులను వితరణ చేశారు. అలాగే లింగన్న&ప్రసాద్ రెడ్డిలు పాఠశాలకు టీవీని వితరణ చేశారు. విద్యార్థులు శ్రద్ధగా చదివి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు.